Home జాతీయ వార్తలు హైకోర్టు జడ్జిల ప్రమాణ స్వీకారం

హైకోర్టు జడ్జిల ప్రమాణ స్వీకారం

High-Court

హైదరాబాద్ : హైకోర్టులో ఆరుగురు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జి రమేశ్ రంగనాథ్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ సోమయాజులు, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ కేశవరావు, జస్టిస్ గంగారావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అమర్‌నాథ్‌లు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. హైకోర్టుకు మొత్తం 61 మంది జడ్జి పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 27 మంది జడ్జిలు పని చేస్తున్నారు. తాజాగా ఆరుగురిని నియమించడంతో జడ్జిల సంఖ్య 33కి చేరింది. ఇదిలా ఉండగా జస్టిస్ రాజా ఇళంగో ఈనెల22న, మరొక జడ్జి వచ్చే నెలలో రిటైర్ కానున్నారు.

High Court Judges sworn