Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

50% దాటొద్దు

పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టు ఉత్తర్వులు

ఎస్‌టి కోటా 50 శాతం దాటినా అభ్యంతరం లేదు
సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ

High-court

హైదరాబాద్: తెలంగాణ పం చాయతీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతాని కి మించరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పుకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్, న్యాయమూర్తి రమేష్ రంగనాథన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏ విధంగా చూస్తున్నా ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని సోమవారం జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో హైకోర్టు తేల్చి చెప్పిం ది. అయితే షెడ్యూల్ ఏరియాలో ఎస్‌టి రిజర్వేష న్లు 50 శాతం దాటినా సుప్రీంకోర్టు తీర్పు ఆటం కం కాదని బెంచ్  వివరించింది. షెడ్యూల్ ఏరియాలో ఎస్టీ రిజర్వేషన్లు యాభై శాతం దాటవచ్చునని సుప్రీంకోర్టు చెప్పడాన్ని బెంచ్ గుర్తు చేసింది . సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన స్వప్నారెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను బెంచ్ విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం గత నెల 21న జారీ చేసిన జి.ఓ.396 ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించుతున్నాయని ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని ఆమె తరుపు లాయర్ వాదించారు. ఆమెతో పాటు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా రిజర్వేషన్ విధానాన్ని సవాల్ చేస్తూ మరో వ్యాజ్యాన్ని కూడా హైకోర్టులో దాఖలు చేశారు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదని కేసులో బెంచ్ విచారణ చేస్తూ గత సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రాల్లో బిసిల జనాభా యాభై శాతం దాటిందని, అందుకని బీసీలకు ముప్పై నాలుగు శాతం ఎస్సీలకు ఇరవై ఎస్టీలకు ఏడు శాతం చొప్పున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు తెలిపారు.
బిసి జనాభా గణన చేసిన తర్వాతే పంచాయతీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించిన విషయాన్ని ఆయన బెంచి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ కేసులో బీసీ రిజర్వేషన్లను ఏ బీ సీ డీ కేటగిరీలుగా చేయాలనే అభ్యర్థన లేదని స్పష్టం చేశారు.దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని.. బీసీల గణన చేసేది లేనిది, ఏబీసీడీలుగా వర్గీకరణ చేసేది లేనిది వేరే విషయమని, ఈ కేసులో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు అన్నీ కలిపి యాభై శాతం దాటడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన బెంచ్ విచారణను వాయిదా వేసింది

Comments

comments