Home తాజా వార్తలు రవిప్రకాశ్ పిటిషన్‌పై ముగిసిన విచారణ

రవిప్రకాశ్ పిటిషన్‌పై ముగిసిన విచారణ

TV9 former CEO Ravi Prakash

మనతెలంగాణ/హైదరాబాద్: ఫోర్జరి, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితులుగా ఉన్న టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణతెలంగాణ హైకోర్టులో మంగళవారం ముగిసింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పులో రిజర్వ్‌లో ఉంచింది. రవిప్రకాశ్ తరపున దిల్‌జిత్ సింగ్ అహూవాల్య వాదనలు వినిపించారు. టివి9 షేర్ల అగ్రిమెంట్ కుట్రపూరితంగా జరిగిందని వాదించారు. ఈక్రమంలో రవిప్రకాశ్‌పై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు కేసులు వేశారన్నారు. టివి9 డైరెక్టర్ల నియామకానికి సంబంధించి రవిప్రకాశ్ ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కల్పించలేదని వాదించారు.

రవిప్రకాశ్ 40వేల షేర్లను సిని నటుడు శివాజికి విక్రయించారని, టివి9 లోగో రవిప్రకాశ్‌కు చెందుతుందనన్నారు. ఈక్రమంలో ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ టివి9 షేర్ల కొనుగోలు నిబంధనల మేరకే జరిగిందన్నారు. టివి9 లోగో ఒక వ్యక్తి ఆస్తి కాదని, అది కంపెనీ ప్రాపర్టీగా ఉంటుందన్నారు. నేషనల్ కంపెని లా ట్రిబ్యునల్‌లో ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవని కోర్టుకు విన్నవించారు. రవిప్రకాశ్, నటుడు శివాజిలకు సంబంధించిన పిటిషన్‌పై నేషనల్ కంపెని అప్లియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టినట్లు హైకోర్టు వెల్లడించింది.

High Court reserves verdict ravi prakash bail