Home తాజా వార్తలు గ్రూప్-2 ఇంటర్య్వూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గ్రూప్-2 ఇంటర్య్వూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

HIGHCOURT

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 ఇంటర్యూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-2కి సెలక్ట్ అయి పరీక్షల్లో వైట్నర్, డబుల్ బబులింగ్‌లో చేసిన 267 మందిని కోర్టు తొలగించింది. మిగతావారికి ఇంటర్యూలు నిర్వహించాలని టిఎస్‌పిఎస్‌కి ఆదేశించింది. గ్రూప్-2కి మొత్తం 3147 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 2016 నవంబర్ 11,13 తేదీల్లో గ్రూప్-2కు పరీక్ష జరిగిన విషయం విధితమే. 2016లో 1032 గ్రూప్-2 పోస్టులకు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో వైట్‌నర్, జంబ్లింగ్ వినియోగంపై ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ఆ పరీక్షల్లో అగ్రస్థానంలోని 5 వేల మంది అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లను పరిశీలించాలని హైకోర్టు కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం ముగ్గురు సీనియర్ లాయర్లతో కమిటీని ఏర్పాటు చేస్తూ హైకో ర్టు న్యాయమూర్తి పి.నవీన్‌రావు గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఒఎంఆర్ షీట్లలో తప్పులున్నా, కొట్టివేతలున్నా, వైట్‌నర్ వాడినా, కిందివైపున పేర్లు రాసినా వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన చరణ్‌దాస్ గోస్వామితో సహా 20 మంది, రామచంద్రారెడ్డి మరో 14 మంది పలు వ్యాజ్యాలను దాఖలు చేసిన విషయం విధితమే.

High Court Verdict on Group-2 Exams

Telangana news