Search
Friday 16 November 2018
  • :
  • :

అవినీతికి కేరాఫ్ అడ్రస్ శ్రీరంగాపురం

Corruption

శ్రీరంగాపురం: మండల కేంద్రంలోని మున్నూర్ వెంకటయ్య తల్లి పేరు మీద 7 గుంటల భూమి ఉంది. తల్లి మరణించిన తర్వాత తన ఇద్దరు కుమారులకు ఒక్కొక్కరికి మూడున్నర గుంటల చొప్పున 2014 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి తహసీల్దార్ వీణ మున్నూర్ వెంకటయ్యకు సోదరుడు మన్నెంకు విరాసత్ చేస్తు  ప్రొసిడింగ్స్ ఇచ్చారు. 2014 నుండి 2017 వరకు మున్నూర్ వెంకటయ్య కొత్త మండలాలు ఏర్పడినప్పటి నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయమని తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ కార్యదర్శి చుట్టు తిరుగుతున్నాడు. అప్‌లోడ్ చేయడానికి వేల రూపాయలు వసూలు చేస్తు సంబంధిత ప్రొసిడింగ్స్‌పై అధికారుల అనుమతి లేకుండా సరైన పద్ధ్దతులను అవలంభించకుండా సర్వేనెంబర్, కుంటలను కొట్టివేస్తు తనకిష్టమున్నట్లు గ్రామ రెవెన్యూ అధికారి తన ఇష్టానుసారంగా రికార్డులను మార్పు చేస్తున్నాడు.

ఆన్‌లైన్‌లో తప్పుడు వివరాలను నమోదు చేసి రైతుల నుండి వేల రూపాయలను వసులు చేస్తున్న విషయం బాధితుడు తహసీల్దార్ సమక్షంలో చెప్పిన ప్పటికీ సమస్య నా దృష్టికి రాలేదు. వచ్చినట్లైతే తగిన చర్యలు తీసుకుంటామని దాటవేత సమాధానం చెప్పారు. రికార్డుల్లో తన ఇష్టమున్నట్లు మార్పులు చేర్పులు చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగుల సహకారం లేకుండా అలా చేయడం వీలు కాదు. కాని ఆ విధంగా జరుగుతున్నాయని వివిధ గ్రామాల రైతులు అందరికీ అవినీతి డబ్బుల్లో అందరికి వాటాలుంటాయని మండల రైతులు ఆరోపిస్తున్నారు. పంటలు పండక గిట్టుబాటు ధర లేక కృంగి పోతున్న రైతులకు తహసిల్దార్ రవీంద్ర కాళ్లపై పడి వేడుకొంటున్న సన్నివేశం కార్యాలయంలోని పలువురి హృదయాలను కలిచి వేసింది. అంతేకాక కార్యాలయంలో ప్రతి పనికి ముఖ్యంగా రెవెన్యూ రికార్డుల విషయంలో పైరవీ కారులను ప్రోత్సహించి విఆర్‌ఎల నుండి విఆర్వోల వరకు ప్రతి ఒక్కరు  తమకు చేతనైనంత బక్క చిక్కిన రైతుల రక్తాన్ని పిండి డబ్బులను వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ రవీంద్రను మన తెలంగాణ ప్రతినిధి ప్రశ్నించగా విషయాలు నా దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే సంబందిత విఆర్‌ఓలకు నోటీస్‌లు జారీ చేసి సంజాయిషీ అడుగుతామని అన్నారు.

Comments

comments