Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మూడో స్మార్ట్‌సిటీ

Smart-city_manatelangana copyమన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘స్మార్ట్‌సిటీ మిషన్’ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్మార్ట్‌సిటీ మిషన్ హైపవర్ స్టీరింగ్ కమిటీ ఈ నివేదికను ఖరారు చేసింది. సచివాలయంలో గురువారం సాయంత్రం స్టీరింగ్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘స్మార్ట్‌సిటీ మిషన్’ స్కోర్‌కార్డ్ ప్రతిపాదనలపై కసరత్తును పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రక టించే ‘టాప్-20’ నగరాల జాబితాలో చేరే విధంగా నివేదికను రూపొం దించారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లతో పాటు మరిన్ని నగ రాల ‘స్కోర్‌కార్డ్’ నివేదికను ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ‘స్కోర్‌కార్డ్’ నివేదికకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర పడగానే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అంద జేయనుంది. గురువారం (జులై 31లోపు) స్మార్ట్ సిటీ నివేదికను కేంద్రానికి అందజేయాల్సి ఉంది. అయితే ‘స్మార్ట్‌సిటీ మిషన్ జాబితాలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెండు నగరాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో మరో నగరానికి అవకాశం కల్పించా లని ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఈ మేరకు నివేదిక తో పాటు ఒక లేఖను కూడా కేంద్ర ప్రభుత్వానిక అందజే యాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర మార్గదర్శ కాల మేరకు వివిధ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు “స్కోర్‌కార్డ్‌”ల ఆధారంగా హైవపర్ కమిటీ పాయింట్లను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. హైవపర్ కమిటీ గ్రే టర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 95 పాయిం ట్స్‌ను, గ్రేటర్ వరంగ్‌కు 87.5, కరీంనగర్‌కు 85, మంచి ర్యాల, జగిత్యాలకు 80 పాయింట్స్‌ను కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పాయింట్స్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం మొదటి “టాప్-20” నగరాలను ఎంపి క చేయనుంది. స్మార్ట్‌సిటీకి గ్రేటర్ హైదరాబాద్ మొదటి టాప్-20లో ఎంపికయ్యే అవకాశం ఉ ంటుందని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా 31 శాతం ప్రజలు పట్టణాలలో జీవిస్తూ జాతీయ స్థూల ఆదాయంలో (జిడిపి) 63 శాతం వాటా ను కలిగి ఉన్నారని, పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో 2030 సంవత్సరానికి 31 శాతం ఉన్న ప్రజ ల సంఖ్య 40 శాతానికి చేరుకుని, జిడిపిలో 70 శాతం వాటాను కలిగి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పట్టణాలలో భౌగోళిక, ఆర్థిక, సామాజిక సమగ్రాభివృద్ధి జరగాల్సి ఉందని భావించి ంది. అందుకే పట్టణాల అభివృద్ధి అత్యంత అవసరమని తెలిపింది. ఇందులో భాగంగానే “స్మార్ట్ సిటీ మిషన్‌” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా 100 నగరాలను గుర్తించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో రెండు నగరాలు ఉన్నాయి. స్మార్ట్ సిటీ నమూనాను రూపొందించే బాధ్యతలను రాష్ట్రాలకే అప్పగించింది. పట్టణాలలో భౌగో ళిక, ఆర్థిక, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని నమూనాను రూపొందించాలని ఆదేశించింది. ఇటీవల ప్రారంభమైన ఈ పథకానికి “టాప్-20” నగరాలకు ప్రస్తుత ఏడాదిలోనే నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ప్రత్యేక నిబంధనలను విధించి, మార్గద ర్శకాలను, 100 పాయింట్స్‌తో “స్కోర్‌కార్డ్‌” నమూనా ను కూడా రాష్ట్రాలకు అందజేసింది. ఈ మార్గదర్శకాలను, “స్కోర్‌కార్డ్‌” నమూనాను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ గ్రేటర్ హైదరాబాద్, వరంగల్‌తో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర ప ంచాయతీలకు అందజేసింది. వెంటనే ప్రతిపాదనలను అందజేయాలని ఆదేశించింది. ఈ విషయమై పలు మార్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి.గోపాల్, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్, సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరకు హైపవర్ కమిటీ ఈ స్కోర్‌కార్డ్ నివేదికను పరిశీలించి ఆమోదం తెలిపింది.

స్కోర్‌కార్డ్, ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఇలా ఉన్నాయి..
పాయింట్స్ : స్మార్ట్ సిటీ ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం ”స్కోర్ కార్డ్‌”ను ఏర్పాటు చేసింది. ఈ కార్డులో వంద పాయింట్స్‌ను కేటాయించింది. సొంతంగా ఆదాయ మార్గలను పెంచుకున్న పట్టణాలకు 10 పాయింట్లను కేటాయించింది.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యపనులు, మరుగుదొడ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలను నిర్వహించినందుకు కూడా పాయిం ట్స్‌ను కేటా యించింది. నీటి సరఫరా నిర్వహణకు కోసం యూజర్ చార్జీలను అమలు చేస్తే 10 పాయింట్స్, జెఎన్ ఎన్‌యు ఆర్‌ఎం ప్రాజెక్టులను పూర్తి చేస్తే 10, ఆన్‌లైన్ ఫిర్యాదులు తీసుకోవడంతో ఫిర్యాదుదారునికి తిరిగి సమాచారాన్ని అందిస్తే 5, ఈ న్యూస్‌లెటర్‌ను అమలు చేస్తే 5, ప్రజా సేవలను ఆలస్యం చేసిన అధికారులపై జరిమానా విది ంచే పట్టణాలకు 5, మూడు సంవత్సరాలుగా ఆదాయా న్ని పెంచుకునేందుకు మార్గాలు అన్వేషించి సత్ఫలితాలు సాదిస్తే మరో 10పాయింట్స్. అదే విధంగా 2012-2013 సంవత్సరం నుంచి ఆడిట్ నిర్వహిస్తే 5 పాయింట్స్ ఇలా వివిధ పనులకు పాయింట్స్‌ను కేటాయించింది.

ప్రతిపాదనలు: “స్మార్ట్ సిటీ” కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రతిపాదనలను అందించాలని కేంద్రం సూచించింది. రాబోయే ఐదేళ్ల కాలంలో స్మార్ట్‌సిటీగా ఎల చేయబోతున్నారో ఊహించగలుగాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలలో పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేస్తారనే విషయమై ప్రత్యేక దృష్టి కనిపించాలని, ప్రధానంగా పట్టణాలలో నివసించే నిరుపేద జీవనవిధానంలో మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రతిపాదనలు ఉండాలని, అదే విధంగా వాటిని అమలు చేయగలగాలని పేర్కొంది.
పట్టణాలలో వీదిదీపాలు, భద్రత చర్యలు, ప్రజా రవాణ వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికలు, పర్యవరణానికి తీసుకునే చర్యలు తదితర అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఇది వరకు రూపొందించిన ప్రణాళికలను సమీక్షించడంతో పాటు పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, వనరుల సమీకరణ, మాస్టర్ ప్లాన్, ట్రాఫిక్ నియంత్రణ, పాదచారులకు తగిన సౌకర్యాలను కల్పించడం లాంటి అనేక అంశాలపై దృష్టి పెట్టాలని కూడా స్పష్టం చేసింది.

Comments

comments