Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఇన్నోవేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం: కెటిఆర్

Telangana First Position in Health sector

హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు.  రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…… ఇన్నోవేషన్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. బోయింగ్, ఎయిర్‌బస్, యుటిసి సిఎఫ్ఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయని పేర్కొన్నారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు.  రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని కొనియాడారు. ఎహెచ్-64 అసాచే హెలికాప్టర్ ప్యూస్ లెజెస్‌లను కేంద్రం ఉత్పత్తి చేయనుంది.   ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్, ఎంపిలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments