Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

RIMS

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం వైఎస్‌ఆర్‌సిపి నేత శ్రీనివాసుల రెడ్డి వైద్యం అందక మృతి చెందిన విషయం తెలిసిందే. మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన చేపట్టారు. రిమ్స్ డైరెక్టర్ శశిధర్‌పై వైఎస్ అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీసం వైద్య పరికరాలు పనిచేయకపోవడం దారుణమని మండిపడ్డారు. వైద్యం చేయకపోవడం వల్లే శ్రీనివాసుల రెడ్డి మృతి చెందాడని ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల నిర్లక్ష్యమేనని కోపగించుకున్నారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో వైఎస్‌ఆర్ ఆస్పత్రిని నిర్మిస్తే…. ప్రస్తుతం వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు.

Comments

comments