Home తాజా వార్తలు మంచాల రహదారిపై ఉద్రిక్తత

మంచాల రహదారిపై ఉద్రిక్తత

Home Guards Strike in Khairatabad X Road

మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల రహదారిపై సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. రహదారిపై మృతదేహాలతో బంధువుల ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని ఆందోళన చేపట్టారు. చనిపోయిన వారికి రూ.25లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని బాధిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన మంత్రి మహేందర్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు.