Home జిల్లాలు సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి

 raneఇబ్రహీంపట్నం: వ్యవసాయంలో రసాయన ఎరువులు వీడి సేంద్రియా ఎరువులు విని యోగించి అధిక దిగుబడి పంటలు పొందాలని కొంగర కలాన్ సర్పంచ్ భంగర్‌గళ్ళ శేఖర్ రైతులకు సూచిం చారు. సోమవారం మండల పరిధిలో కొంగర కలాన్‌లో మన తెలంగాణ- మన వ్యవసాయం సందర్భంగా రైతు లకు అవగాహణ సదస్సు నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొంగర కలాన్, మంగల్ పల్లి గ్రా మంలో నిర్వహించిన కార్యక్ర మంలో కొంగర కలాన్ సర్పంచ్ బి.శేఖర్ మాట్లాడుతూ రాబోయే వర్ష కాలం వరకు రైతులు అందరు భూ సార పరిక్షలు చేయించకోని భూములను సిద్దం చేసుకోవాలని అన్నారు. వ్యవసా యంలో భూసారం సంరక్షణ పద్దతులు పాటిం చక పోవటం వల్ల అధిక దిగుబడి పంటలు పండించటం లేదన్నారు. వర్షభావ పరిస్థితుల వల్ల సమృద్దిగా పంటలు పండించటం కష్టం అవుతుందని కావున ఉద్యా నవన, ఆరుతడి, పందిరి, కూరగాయల పంటలు, బిందు సేద్యం పంటలు తక్కువ నీటితో అధిక దిగుబడి పంటలు సాధిం చవచ్చన్నారు. సిజన్‌లో వ్యవసాయ సాగుపై సం బంధిత అధికారుల, సలహాలు సూచనలు పాటించాలని రైతులను కోరారు. ప్రభుత్వం నిర్వహించే రైతు అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకో వాలని రైతులకు సూచించారు. మంగల్‌పల్లి సర్పంచ్ కె.అశోక్ గౌడ్, వ్యవసాయ శాఖ ఎడిఎ కె.కవిత, వరప్రసాద్ రెడ్డి,శ్రావణ్ కుమార్,రఘు, ఉద్యాన వన అధికారిణి కనకలక్ష్మి, పశుసంవర్థక శాఖ అధికారి సురేష్ పాల్గొన్నారు.
ఆధనిక పద్ధ్దతులపై మక్కువ చూపండి
ఇబ్రహీంపట్నం టౌన్: రైతులు పాత పద్దతిని విడనాడి ఆదునిక పద్దుతులు వాడాలని ఇబ్రహీంపట్నం ఏడిఏ కవిత పేర్కోన్నారు. సోమవారం ఆమే వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాలలో మన తెలంగాణ – మన వ్యవసాయంపై రైతులకు అవగాహాన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయంపై ఆదారపడిన గ్రామాలలో పెద్ద ఏత్తున అవగాహాన సదస్సులకు హాజరైతున్నారని తెలిపారు. రైతులు పాత పద్దతులను విడనాడి శాస్తా సాంకేతిక పద్దతులను తెలసుకోవాలని అన్నారు. ప్రభుత్వం వాటికి రాయితీలపై సబ్సీడి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో కూలీల కొరత తగ్గుతుందని చెప్పారు. బిందు సేద్యంవాడాలని చెప్పారు. కరువులో నీటిని తగ్గించేందకు బిందు సేద్యంపు పట్టలను వేయాలని రైతులకు సూచించారు. బిందు సేద్యంపై ఏకరం వరి పండించె రైతలకు 5 ఏకరాల వరకు వరి సాగు చేయవచ్చని పేర్కోన్నారు. భూసార పరిక్షలు తప్పని సరిగా చేయించాలని సూచించారు. ఏరువాక కోసం ప్రభుత్వం ముందస్తుగానే రైతులను అవగాహాన పెంచి వారికి తర్పీదు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఏక్కడ చూసిన గ్రామాలలో మంచి స్పందన వస్తుందని చెప్పారు.
సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు
ఘట్‌కేసర్ రూరల్: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వ్యవసాయ పనిముట్లను 50 శాతం సబ్సీడిపై ఇవ్వనున్నట్లు హయత్‌నగర్ ఎడిఎ అజయ్ కుమార్ ఘోష్ తెలిపారు. మండల పరిధిలోని కొర్రెములలో ప్రధాన కూడలి వద్ద సొమవారం మన తెలంగాణ-మన వ్యవసాయం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, వ్యవసాయ అధికారుల సలహాల సూచనల మేరకే పంటలు వేయడం వల్ల అధిగ దిగుబడులు పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీమ పథకాలను రైతులు సద్వినియెగం చేసుకోవాలని సూచించారు. సబ్సిడిపై చొప్ప కత్తిరించే యంత్రాలను 50 శాతంపై అందజేస్తున్నట్లు తెలిపారు. భూసార పరీక్షలు చేయించుకున్న రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బైనగారి నాగరాజు, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యాక్షుడు గ్యారా లక్ష్మయ్య, మండల వ్యవసాయ అధికారి శ్రీవాణి, పోచారం పశువైధ్యాధికారి మురళీధర్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కుర్వి మహేందర్, నాయకులు తరుణి మహేంద్ర చారీ, గోపు బాలయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.