Home వనపర్తి స్ప్రింక్లర్లతో అధిక దిగుబడులు

స్ప్రింక్లర్లతో అధిక దిగుబడులు

మండల వ్యవసాయాధికారి కుర్మయ్య

Sprinker1

శ్రీరంగాపూర్ : మండలంలోని అన్ని గ్రామాల్లో యాసంగి సాగులో వేరుశనగ, మినుములు,పెసర్లు, ఆరుతడి పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. మంలంలోని జూరాల ఆయకట్టు భీమా పేజ్2  ఆయకట్టు కింద సాగుచేసిన ఆరుతడి పంటలకు నీటి పారుదల వసతి ఉన్న వాటికి ముఖ్యంగా వేరుశనగ పంటలకు ఫ్లడ్ ఇరిగేషన్ పద్దతిలో కన్నా స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ పద్దతి లో నీటి సౌకర్యం కల్పిస్తే అధిక దిగుబడులు వస్తాయని ఆయన తెలిపారు.  ఫ్లడ్ ఇరిగేషన్‌లో భూమి గట్టి పడుతుంది . స్ప్రింక్లర్స్‌తో నీటి పారుదల వసతి కల్పించినచో , భూమి ఎల్లప్పుడు గుల్లా ఉంటుంది.  వీటి వల్ల వేరు వ్యవస్థ బాగా వృద్ది చెంది అధిక దిగుబడులు ఇస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కావున రైతులందరు స్ప్రింక్లర్స్ మరియు డ్రిప్ ఇరిగేషన్‌తో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు గడించవచ్చని ఆయన అన్నారు.

రైతు నాగన్న …
స్ప్రింక్లర్స్ వాడటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పంటలను నీరు ఇవ్వవచ్చు. పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది.

మండల వ్యవసాయాధికారి కుర్మయ్య
ఫ్లడ్ ఇరిగేషన్ కన్నా స్పింకర్లు మరియు డ్రిప్ ఇరిగేషన్ తో భూమి గట్టి పడకుండా గుల్లాగా ఉండి వేరువ్యవస్థ బాగా వృద్ది చెంది అధిక దిగుబడిని ఇస్తుంది.