Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఉన్నత విద్యపై జాతీయ సదస్సు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

attendanceహైదరాబాద్: ఉన్నత విద్యపై రాబోయే మూడు నెలల్లో విద్యారంగ నిపుణులతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి తెలిపారు. ఈ సదస్సులో ఉన్నత విద్యలో సవాళ్లు, నాణ్యత తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే విశ్వవిద్యాలయాల అభివృద్దికి రాష్ట్రంలోని వర్సిటిల ఉప కులపతులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. వర్సిటిల స్థితిగతులు, సిలబస్, కొత్త కోర్సులు, నియామకాలు తదితర అంశాలు సమగ్రంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశ ంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటిల పరిధిలోని యుజి, పిజి కోర్సులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు అమలు చేయా లని నిర్ణయించామన్నారు. యుజి, పిజి కోర్సులు అందిస్తున్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ బయోమెట్రిక్ మెషిన్ల కొరతతో పాటు వివిధ కారణాల వల్ల అమలు కాలేదని చెప్పారు. ప్రస్తుతం జెఎన్‌టియు, మహాత్మా గాంధీ వర్సిటిలో బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నారని, మిగతా వర్సిటిలలో కూడా తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలి పారు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వా నికి సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉన్నత విద్యలో చాలా కోర్సులలో సీట్లు మిగిలిపోతున్నందున ప్రవేశ పరీక్షలు లేకుండా మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించే అంశాలను, ఏకీకృత చట్టం (యూనిఫైడ్ యాక్టు) కమిటి, కేంద్రం తీసుకురానున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ కె.వెంకటాచలం, ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్, కార్యదర్శి ఎన్.శ్రీనివాస్‌రావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Comments

comments