Home తాజా వార్తలు మొదలైన ప్రైవేట్ స్కూళ్ల దోపిడి…

మొదలైన ప్రైవేట్ స్కూళ్ల దోపిడి…

 Private Schools

 

ముస్తాబాద్ : వేసవి సెలవుల అనంతరం తమ పిల్లలకు మంచి నాణ్యత ఉన్న విద్యను అందించాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటాడు. కానీ నాణ్యమైన విద్యను అందించాలంటే డబ్బులు ఫీజుల రూపంలో ముట్టజెప్పాలనే పరిస్థితి ఏర్పడింది. మండలంలో స్కూల్స్ పునఃప్రారంభం అవ్వగానే స్కూల్ యజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను ఏవిదంగా బురిడి కొట్టించాలనే వివిధ ఆలోచనలలో ఉన్నారు. విద్యావిదానాలను పక్కన పెడితే కేవలం డబ్బె ముఖ్యమన్నట్టుగా విద్య అనే పేరుతో వేల డబ్బులను ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు దండుకుంటున్నాయి అనడంలో అతిశయోక్తి లేదేమో.

ఇలాంటి విద్యావ్యవస్థ ప్రభుత్వం అదుపు చేయకపోవడం ట్రాజెడి. పిల్లల భవిష్యత్ మీద కోటి ఆశలు పెట్టుకుంటున్న తల్లిదండ్రుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటు మండలంలోని ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు బహిరంగ వ్యాపారం చేస్తున్నాయి. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తు తల్లిదండ్రులకు నరకం చూపిస్తాన్నారు.పిల్లల్ని చేర్పించక ముందు ఓ మాట చేర్పించన తర్వాత నెల రోజుల నుండే ఫీజు అనే పేరుతో పిల్లల్ని మానసిక వేదనకు గురిచేస్తు పరీక్షలకు దూరంగా పెడుతూ తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు.

ప్రతి ఒక్కరు పిల్లలు బాగా చదువుకోవాలని మంచిపొజిషిన్‌కి రావాలని అనుకుంటారు. అప్పు చేసైనా ఉన్నత స్థాయికి చేర్చాలని అహర్నిషలు కష్టపడుతుంటారు. ఈ పాయింట్‌నే క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ స్కూల్స్ యాజమన్యాలు. మీ పిల్లల భవిష్యత్ బాగుంటాలంటే మాబడిలో చేర్పించండి అంటూ ప్రతి ఏటా ఊదరగొడుతూ ఊబిలోకి దింపేస్తున్నాయి. అంతటితో ఆగకుండా పిల్లలు బడిలో చేరిన తర్వాత నోట్ బుక్స్,టెక్స్‌బుక్స్ అంటూ స్కూల్‌లోనే పక్కా బిజినెస్ చేస్తున్నాయి. ఫీజుల విషయంలో ఒక్కో స్కూల్ ఒక్కో శైలి. స్కూల్‌ని బట్టి రేట్లు మారుతుంటాయి. కేవలం తల్లిదండ్రుల బలహీనతలను అడ్డుపెట్టుకొని లక్షలు దండుకుంటున్నారు.దీనిని మండలంలో ప్రశ్నించే వారే లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని ఫీజుల నియంత్రణకై ఒకదాటికి రావాలని ఆశిద్దాం.

Higher Fees should be stopped in Private Schools