Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

గుట్కా దందా

gutka-done-in-pts

గద్వాల: గుట్కా, పాన్‌మసాలా, ఖైనీ జర్దా, అంబర్‌లపై ప్రభుత్వం నిషేధం విదించింది. అయినా జోగులాంబ గద్వాల జిల్లాలో విచ్చల విడిగా గుట్టుగా వ్యాపారం సోగుతోంది. జిల్లాలో అన్ని మండలాలలో ఈ వ్యాపారం చాపకింద నీరులా నడుస్తోంది. కార్మికులు, కులీలు, చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు చివరకు చదువుకున్న వారు ఉద్యోగులు కూడా వీటిని నమిలేస్తున్నారు. పట్టణంలో, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కిరాణం, పాన్‌షాప్ లలో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మేమున్నమంటూ నామమాత్రంగా అధికారులు దాడులు చేస్తూ చేతులు దులుపు కుంటున్నారు. దాడులు నిర్వహించేటప్పుడు అధికారుల విషయం ముందుగానే తెలుసుకుంటున్న షాపుల యజమానులు యధావిధిగా మరుసటి రోజు నుంచి తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.

వీటిని నియం త్రించాల్సిన అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ గుట్కాలను ప్రభుత్వం నిషేధించినప్పటి నుంచి వీటి ధరను అమాంతం పెంచేసి జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. రోజుకు లక్షల గుట్కాలను నమిలిపడేస్తున్నారు. వీటికి అలవాటు పడిన వారు నోరు, గొంతు, శ్వాసకోశాలకు సంబంధించిన ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గద్వాల పట్టణంలోనే కాక వివిధ మండాలాలకు చేరవేస్తున్నారు. ఈ విక్రయాలు పక్కగా సాగడానికి కంపెనీ తరపున డీలర్లు, సబ్ డీలర్లు ఏర్పడి అడ్డూ అదుపూ లేకుండా జోరుగా వ్యాపారం సాగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ గుట్కా వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Comments

comments