Search
Sunday 23 September 2018
  • :
  • :

చరిత్ర సృష్టించిన హిమ దాస్

Hima Das becomes first Indian woman to bag gold in IAAF World Under-20 Championships

ఫిన్లాండ్: భారత స్పింటర్ హిమ దాస్ చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్‌లో జరుతున్న ఐఎఎఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హిమ దాస్ 400 మీటర్ల పరుగు పందేంలో స్వర్ణపతకం గెలిచింది. అస్సాంకి చెందిన 18 ఏళ్ల హిమ 400 మీటర్ల పరుగును కేవలం 51.46 సెకన్లలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కాగా, ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారత అథ్లెట్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలవడం ఇదే తొలిసారి. హిమ దాస్ తర్వాత రొమేనియా అథ్లెట్ మిక్లో 52.07 సెకన్ల‌తో రజతం, అమెరికాకి చెందిన టేలర్ మన్సన్ 52.28 సెకన్లతో కాంస్య పతకం గెలిచారు.

Comments

comments