Home రాష్ట్ర వార్తలు హిందీ భాష మన జాతీయ గుర్తింపు

హిందీ భాష మన జాతీయ గుర్తింపు

governorతార్నాక: హిందీ మాధ్యమంతో కూడిన భారతదేశాన్ని నిర్మించాలని గవర్నర్ ఇ. ఎస్.ఎల్.నరసింహన్ పేర్కొన్నారు. హిందీ రాజభా షా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం తా ర్నాక ఐఐసిటిలో దక్షిణ-పశ్చిమ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర రంగ సంస్థల్లో హిందీ భా షాభివృద్ధ్దికి కృషిచేస్తున్న ఉద్యోగులకు నగర రాజ భాషా కార్యాన్వయ సమితి (టోలీ) ఆధ్వర్యంలో ని ర్వహించిన పురస్కార అవార్డుల వేడుకలకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరై, అవార్డులను అందజేశా రు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ హిందీ భాష మన రాజ భాష మాత్రమే కాదు మన జాతీయ గు ర్తింపు అని అన్నారు. ప్రపంచ భాషల్లో భారతీయ హిందీ భాష నిక్షిప్తమై ఉందన్నారు. హిందీ భాషను విజ్ఞానికంగానే కాకుండా వైజ్ఞానిక పరంగా అభివృ ద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రజలు అన్ని భాషలకు సమానంగా హిందీ భాష ను అభివృద్ధి చేయాలన్నారు. హిందీ భాష తెలియ డం వల్ల దేశ సంక్షేమ ప్రయోజనాలను ప్రతి ఒక్క రూ పొందుతారని అన్నారు. కళా సాహిత్య రంగా ల్లో హిందీ భాషను విస్తరించడం ద్వారా భారతీయ సాహిత్యం వృద్ధ్ది చెందుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో భారతీయులు హిందీ భాష అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ప్రదీ ప్ చంద్ర, హిందీ భాషాధికారి ప్రభాష్ కుమార్ ఝా, బిపిన్ బిహారి, డా.డి.మణివణ్ణన్, బిస్వనాధ్ ఝా తదితరులు పాల్గొన్నారు.