Home జాతీయ వార్తలు హిందీ తప్పనిసరి

హిందీ తప్పనిసరి

  • సిబిఎస్‌ఇ, కేంద్రీయ విద్యాలయాల్లో 10 వరకు విధిగా పాఠ్యాంశం చేయాలి
  • పార్లమెంటరీ కమిటీ నివేదికకు ప్రణబ్ ఆమోదం
  • రాష్ట్రపతి, మంత్రుల ప్రసంగాలు హిందీలోనే…

Kedirya-Vidyalaya

న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఇ), కేంద్రీయ విద్యాలయలకు అనుబంధంగా ఉన్న విద్యాసంస్థలలో చదివే విద్యార్థులు ఇకపై 10 వ తరగతి వరకు హిందీ తప్పని సరిగా చదవాల్సి  ఉంటుంది. ఈ మేరకు పార్లమెంటరీ సంఘంచేసిన  సిఫారసులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఆమోదించారు. హిందీని తప్పనిసరి చేసేందుకు రాష్ట్రప్రభు త్వాలతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని,  పాఠ్యాంశాలలో హిందీని తప్పనిసరి చేసేందుకు తీవ్రంగా కృషి చేయాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖను రాష్ట్రపతి ఉత్తర్వు ఆదేశించింది. అధి కార భాష హిందీపై పార్లమెంటరీ సంఘం చేసిన తొమ్మిదవ నివేదికలోని చాలా వరకు సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించారు. ఆ నివేదికను 2011 లో సమర్పించారు. తొమ్మిది, పది  తరగతుల్లో ఇంగ్లీషుతో పాటు మరో రెం డు భారతీయ భాషలను బోధించాలని సిబిఎస్‌ఇ గత ఏడాది ప్రతిపాది ంచింది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  హిందీ చదువడం, రాయడం, మాట్లాడడం వచ్చిన ప్రముఖులందరూ ఇక పై హిందీలోనే తమ ప్రసంగాలు చేయాల్సి ఉంటుందని అధికారిక ఉత్తర్వు పేర్కొంది. రాష్ట్రపతి ఆమోదించిన అనేక సిఫారసులలో భారతీయ విమానా ల్లో ఇకపై ఇంగ్లీషుతో పాటు హిందీలో ప్రకటనలు చేస్తారు. విమానాలలో చదివేందుకు సగం పుస్తకాలు హిందీలో ఉండనున్నాయి. విమానాల్లో హిందీ చాలా వరకు నిర్లక్షానికి గురవుతున్నట్లు పార్లమెంటరీ సంఘం పేర్కొంది.  సిఫారసులను అమలు చేయాలని పౌర విమాన మంత్రిత్వ శాఖకు ఆదేశి ంచారు. పవన్ హెలికాప్టర్లు సహా అన్ని భారతీయ విమానాలలో టికెట్లన్ని ంటిపై హిందీ కూడా గరిష్ఠంగా ఉపయోగించేలా పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది. దీనిని రాష్ట్రపతి ఆమోదించారు.  రాష్ట్రపతి ఆమోదించిన మరో సిఫారసు ఏమిటంటే… హిందీ మాట్లాడని రాష్ట్రాలలో పరీక్షలు, ఇంట ర్వూలలో హిందీని విద్యార్థులకు  ఐచ్ఛికం చేయాలన్నది.