Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఒకే వేదికపై… ఒక్కటైన 131 జంటలు

Marriage

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లాలో శుక్రవారం ఒకే వేదికపై 131 జంటలు ఒక్కటయ్యాయి. కుల, మతాలకు అతీతంగా జరిగిన ఈ భారీ వివాహ వేడుకలో 46 ముస్లిం జంటలు ఉన్నాయి. ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన’ పథకం కింద ఈ పెళ్లిళ్లు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కేంద్రమైన తాకుర్‌ద్వారా గ్రామంలో హిందూ, ముస్లిం దంపతుల కోసం సామూహిక మండపాలను ఏర్పాటు చేశారు. పేదకుటుంబాలను ఆదుకునేందుకు యుపి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేదికపై వివాహం చేసుకున్న నూతన దంపతులకు ప్రభుత్వం తరపున రూ.20 వేల నగదు కూడా ఇస్తున్నారు.

Hindu, Muslim Couples Tie the knot together in Mass Marriage in UP.

Comments

comments