Home అంతర్జాతీయ వార్తలు మృత్యువు ముందు మోకరిల్లిన మానవత్వం

మృత్యువు ముందు మోకరిల్లిన మానవత్వం

alyan-kurdi-syria-refugees2హృదయ విదారకమైన దృశ్యాలు మనసును కలచివేస్తుంటాయి. గుండెలను పిండేస్తుంటాయి. యావత్ ప్రపంచాన్ని కదిలిస్తుంటాయి. చిన్న విష యానికి చిగురుటాకులా వణికే చిన్నారులకు సంబం ధించిన ఘోరమైన దృశ్యాలు కంటతడి పెట్టిస్తుం టాయి. 1984లో భోపాల్ గ్యాస్ లీకేజీ నుంచి సిరియా శరణార్థుల ఉదంతాల వరకూ వచ్చిన ఫోటో దృశ్యాలన్నీ మానవత్వాన్ని ప్రశ్నించినవే. అందులో చిన్నారుల మృత్యు దృశ్యాలు మానవత్వా నికి కమురు వాసన అంటించినవి. ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ రఘురాయ్ కెమెరాకంటికి చిక్కిన ఓ చిన్నారి పీకలోతు నేలలో కూరుకుపోయి ఉన్న మృతదేహాన్ని భోపాల్ విషాద సంఘటన దృశ్యంగా మలిచాడు.

అదేతరహాలో, వారం రోజుల క్రితం టర్కీ సముద్రతీరంలో మూడేళ్ల పసిబిడ్డ నిర్జీవంగా పడివున్న దృశ్యాన్ని మహిళా ఫోటోగ్రాఫర్ నిలూఫర్ డెమిర్ కెమెరాకు చిక్కింది. ఈ రెండు ఫోటో దృశ్యాలను చూసినప్పుడు బాధతో మనసు మొద్దుబా రిపోతుంది. సభ్య సమాజాన్ని కంటనీరు పెట్టించిన ఈ రెండు ఫోటో దృశ్యాల వెనుక విషాద చరిత్ర ఉంది. విధివంచితుల జీవితాలున్నాయి. రక్తంతో తడిసిన ప్రపంచ చరిత్ర ఉంది.

భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో చనిపోయిన వేలాది శవాలను మూకుమ్మడిగా ఖననం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ తండ్రి తన కొడుకు జాడ కోసం కలియతిరుగుతున్నాడు, ఖననం చేయబడుతున్న శవాల మధ్య తన చిన్నారి పీకలోతు మట్టిలో కూరుకు పోయి, ముఖం మాత్రమే కనిపించిన దృశ్యా న్ని చూసి తండ్రి గుండెలు బాదుకున్నాడు. ఖననానికి సిద్ధంగా ఉన్న చిన్నారిని రఘురాయ్ కెమెరాలో బంధించాడు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఫోటో దృశ్యం భోపాల్ విషాద సంఘటనకి ప్రతీకగా నిలిచింది.

ముఫ్పై ఏళ్ల క్రితం, డిసెంబర్ 2, 1984న అందిరిలాగే భోపాల్ వాసులు నిద్రకు ఉపక్ర మించారు. అంతలోనే, ఘాటైన వాసనతో ముక్కు పుటాలు అదిరాయి. కంట్లో కారం చల్లిన మంట. ఊపిరి అందక వేలాది మంది మరణించారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటన తాలూకూ ప్రభావం ఇప్పటికీ కలచివేస్తూనే ఉంది. చరిత్రలో ఘోరమైన ఉపద్రవంగా మారుతుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. గ్యాస్ లీకేజీవల్ల అధికారికంగా 3,787 మంది మరణించినప్పటికీ, ఈ సంఖ్య ఐదు వేలకు దాటింది. ఐదున్నర లక్షల మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మరెంతో మంది రకరకాల వైకల్యాలతో దర్భురమైన జీవితాల్ని వెళ్ళదీస్తున్నారు. యూనియన్ కార్బైడ్ సంస్థ తయారుచేసే సేవిన్. టేమిక్ క్రిమిసంహారక మందుల వ్యర్థాలతో అక్కడి భూముల్లో గడ్డి కూడా మొలవడం లేదు. కంపెనీ పరిసరాల్లో పాతిపెట్టిన వేలాది టన్నుల రసాయన వ్యర్థాలు భూమిలో ఇంకి, నీటిలో కలిసి ఆ ప్రాంతమంతా విషపూరితంగా మారింది. గాలి, నీరు కలుషితమై ఇప్పటికీ జీవనానికి అనువైన వాతావరణం లేకుండా పోయింది.

నీలం చొక్కా, ఎర్ర టీషర్ట్, కాళ్లకు షూస్ ధరించిన బాలుడు టర్కీ సముద్ర తీరాన ఇసుక తిన్నలపై హాయిగా బోర్ల పడుకొని నిద్రపోతున్నట్టు కనిపిస్తోంది. కానీ, వాస్తవం ఘోరమైనది. ముక్కు పచ్చలారని మూడేళ్ల చిన్నారి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సిరియాలోని కుర్దు వర్గానికి చెందిన ఈ బాలుడి పేరు అయిలాన్ కుర్దీ గ్రీకు దీవులకు చేరుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా పడవలో వస్తూ మునిగిపోయిన వారిలో ఒకరి సంతానం. సిరియాలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వలస వెడుతున్న అబ్దుల్లా కొడుకే అయి లాన్. అబ్దుల్లా భార్య రేహన్, పిల్లలు అయిలాన్, గాలివ్‌లతో చేసిన సముద్ర ప్రయాణం తీరని విషాదం మిగిల్చింది. పడవ ప్రమాదంలో భార్య, ఇద్దరు పిల్లలు నీట మునిగిపోయారు. నిలూఫర్ డెమిర్ తీసిన అయిలాన్ ఫోటో దృశ్యం మానవ జీవన వికాసంపై నీలి నీడలు కప్పేసింది.

పరాయి పాలనలో ఉన్న సిరియాకు 1946లో స్వాతంత్య్రం వచ్చింది. అమెరికా అనుకూల ప్రభు త్వం 1949లో కొలువుదీరింది. అదే సమయంలో మిలటరీ అధికారులు పాలన చేజిక్కించుకున్నారు. వీరికివ్యతిరేకంగా సిరియాలో తిరుగుబాటు రావడం తో 1954లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధి కారాన్ని అప్పగించడానికి మిలటరీ పాలకులు అంగీకరించారు. 1955లో తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే సమయంలో ఈజిఫ్ట్ సైనికుల ప్రేరణ, సహకారంతో సిరియాలోకి మిలటరీ పాలన మొదలైంది. మిలటరీ గ్రూపుల నాయకత్వంలో సాగిన సిరియా పాలన చివరకు, 1963లో బాత్ పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. ఈ పార్టీ 50 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని కొనసాగించింది.
1970లో అధికారం లోకి వచ్చిన హఫీద్ అల్ అసద్ వారసత్వాన్ని కొనసాగించడంలో అసద్ ముందున్నారు. 50 ఏళ్లుగా మానవ హక్కుల మాటన్నది లేకుండా పాలన సాగించడంతో గత ఏడాది అరబ్ ప్రపంచాన్ని కుది పేసిన తిరుగుబాటు ఉద్యమాలు సిరియా ప్రజ లకు కొత్త ప్రేరణ ఇచ్చింది. టునిషియా, లిబియా, ఈజిప్ట్, యెమెన్‌లను కుదిపేసిన ఉద్యమాలపై సాను కూలంగా స్పందించిన అసద్, సిరియా ఆందోళనల్ని మాత్రం అగ్రరాజ్యాల కుట్రగా అభివర్ణిస్తున్నారు.

సిరియా సైనిక పాలనకు నిరసనగా అల్ హసక్కా సంస్ధకు చెందిన హసన్ అలీ గ్యాసోలిన్ మంటల్లో ఆత్మార్పణం చేసుకోవడంతో ఆందోళనలు మొదలయ్యాయి. సిరియా జాతీయ జెండాను చేతబట్టి వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఇది కాస్త కార్చిచ్చులా దేశవ్యాప్తంగా విస్తరించడంతో సిరియా అగ్ని గుండంలా మారింది. 2011 నుంచి ఆందోళన లు విస్తరించాయి. 2012 డిసెంబర్ 13న సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో జరిగిన బాంబు దాడి, అంతకుముందు రోజు భవనంపై జరిగిన దాడిలో గృహమంత్రిలెప్టినెంట్ మొహ్మద్ ఇబ్రహీం అల్ హసార్ గాయపడడం… అప్పటినుంచి దాడులు ప్రతిదాడులతో సిరియా అట్టడుగుతూనేవుంది. అంతర్యుద్ధాలతో నలిగిపోతూ మారుభూమిలా మారింది. మాతృభూమిలో బతికి బట్టకట్టలేక తప్పని పరిస్థితుల్లో వలసబాటపడుతూ… ఆ పయనంలో వేలాది మంది మృత్యు తీరాలకు చేరుతున్నారు. ఇందుకు అయిలాన్ కుర్దీ ప్రత్యక్షసాక్షి.

Kodam pavankumarకోడం పవన్‌కుమార్
– 9848992825