Home ఆఫ్ బీట్ వేల్పులకోట జఫర్‌గడ్

వేల్పులకోట జఫర్‌గడ్

Japhargad-Khillaజఫర్‌గడ్ ఖిల్లా ప్రసిద్ధమైన చారిత్రక కట్టడం. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో గల ఈ కోటను నిజాం నవాబులు నిర్మించారు. నిజాం నవాబులు ఈ గ్రామాన్ని ఆక్రమించుకోక పూర్వం వేల్పుకొండగా పిలిచేవారు. పూర్వ చరిత్ర ను చాటి చెప్పే కళాఖం డాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఫిరం గులు ఆలనా పాలన లేక కొన్ని కాలగ ర్భంలో కలిసిపోగా, మరికొన్ని మిగి లాయి. వాటిని పరిర క్షించే నాథుడే కానరాకపో వడంతో సంస్కృతి చిహ్నాలు తెరుమరుగయ్యే ప్రమాదం కనిపి స్తోంది. ఇక్కడి జాగీర్దార్లు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను చెల్లించడం మానేశారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన నిజాం నవాబు జాఫ్రత్ దౌలా అనే సర్కార్‌ను ఈ ప్రాంతానికి పంపాడు. సైన్యంతో తరలివచ్చిన జాఫ్రత్‌దౌలా జాగీర్దారుల తలవంచి వారి నుంచి బకాయి పన్నులు వసూలు చేశాడు. రెండు కొండల మధ్య పచ్చదనం తో ఆహ్లాదం కలిగిస్తున్న ఈ ప్రాంత సౌందర్యానికి ముగ్దుడైన జాఫ్రత్‌దౌలా ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బును నిజాం నవాబుకు పంపకుండా ఇక్కడే మకాం వేసి సైన్యాన్ని విస్తరించాడు. జాఫ్రత్‌ధౌలా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత తూర్పు, పడమర కొండల మధ్య గ్రామా న్ని నెలకొల్చి ఈ గ్రామానికి తన పే రు ఉండేలా జఫ్ర త్‌దౌలా జఫర్‌గడ్ గా నామకరణం చేశాడని చరిత్రకా రులు, ఇక్కడి వృద్ధులు చెబుతున్నా రు. ఈ కొండల మధ్య గ్రామాన్ని నిర్మించి కొండ చుట్టూ కోట గోడలను నిర్మిం చాడు. గ్రామంలోకి శత్రువు చొరబాటు ను అడ్డుకునేందుకు మూడు వైపుల పెద్ద ద్వారాలు నెలకొల్పాడు. గ్రామ ప్రజలు మూడు వైపుల ఉన్న ద్వారాలను హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం దర్వాజాలుగా పిలుస్తారు. అంతేకాక గ్రామం చుట్టూ మట్టితో పెద్దపెద్ద కట్టలు పోసి కందకాలు తవ్వించి నీటిని నింపేవారు. మట్టి కట్టడాలపై సైని కులు కాపలా ఉండేందుకు గ్రామం చుట్టూ సుమారు 40 బతేరీలను (బురుజులు) నిర్మించారు. శత్రువులను ఎదు ర్కొనేందుకు జాఫ్రత్‌దౌలా ఆయుధ సామగ్రిని కూడా సమకూర్చుకున్నాడు. ఇనుము, పంచలోహాలతో తయా రు చేసిన ఫిరంగులను వాడినట్లు ఇక్కడి వాటి అవశేషా లు నిరూపిస్తున్నాయి. జాఫ్రత్‌దౌలా 1853 సంవత్స రంలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలించినట్లుగా చరిత్ర చెబుతుంది. వేల్పుకొండకు మరమ్మత్తులు చేయించ డానికి జఫ్రత్‌దౌలా దుర్గ నిర్మాణానికి అవసరమైన ధనం కోసం జగన్నాథ పూజారి, జగ్గుమంతులు, బ్రహ్మాండనాయ కులు అనే వారికి కోట రక్షణ భాధ్యతలు అప్పగించి, రాజా అశ్వారావును ముట్టడించి నరికి అశ్వారావుపేటను స్వాధీన పరుచుకున్నాడు. ఇందుకే జఫ్రత్‌దౌలా చేతిలో నష్టపోయిన దేశ్‌ముఖ్‌లు వేల్పుకొండను తిరిగి ఆక్రమించుకోవడానికి కుట్ర పన్నారు. దానితో ఈ ప్రాంతం వదిలి ప్రస్తుత్తం కొత్త జిల్లాగా ఏర్పడిన నిర్మల్‌కు జఫ్రత్‌దౌలా పారిపోయాడు. ఆ ప్రాంతంలో కూడా సైన్యాన్ని విస్తరించుకొని కొన్ని సంవత్స రాలు పాలన సాగించి అక్కడే మరణించాడు. జఫ్రత్‌దౌలా సమాధి నిర్మల్‌లో ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. జఫర్‌గడ్ ఖిల్లాను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
మునులు ఏలిన జఫర్‌గడ్డ
జఫ్రత్‌దౌలా కంటే పూర్వం కాకతీయ కాలంలో వేల్పులు అనే మునులు ఈ ప్రాంతాన్ని పాలించారని చరిత్ర చెబుతుంది. జఫర్‌గడ్‌లోని పడమర కొండ వెనుక గ్రామం ఉండేదని, దీనిని వేల్పుకొండ గ్రామంగా పిలిచేవారని చెప్పుకుంటారు. పాత మసీదు, దేవాలయాలు శిథిలావస్థలో దర్శనమిస్తుం టాయి. కాకతీయుల కాలంలో పాత ఊరు ఉండిన ప్రాంతా న్ని ఇక్కడి ప్రజలు పాతూరుగా పిలుస్తుంటారు. మధ్యయు గపు భైరువుని విగ్రహలు, త్రికూటాలయం, వైష్ణవాలయాలు ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి. ఇక్కడి పెద్దలు పాతూర్‌లో ప్రసిద్ధిగాంచిన శివాలయం (గంటలగుడిగా పిలుస్తారు) గురించి ఎక్కువగా చర్చించుకుంటారు. ఆ శివాలయానికి ఎదురుగా ఉన్న రాతి గరుడస్తంభం సుమారు 45 అడుగుల ఎత్తుపై కోట్ల విలువ కలిగిన పంచలోహంతో చేసిన భద్రకాళి విగ్రహం, ఆభరణాలు ఉండేవని, వాటిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని చెబుతారు.
కొండపై శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రము
రాష్ట్రంలో యాదగిరిగుట్ట తరువాత అంతటి ప్రాశ్యస్తం జఫర్ గడ్ మండలం పడమర గుట్ట కొండపై రాతిని చీల్చుకొని సతీసమేతంగా వెలిసిన వేల్పుకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఉంది. ఈ క్షేత్రాన్ని పంచ నృసింహ క్షేత్రమని పిలు స్తారు. వీరనరసింహ, లక్ష్మీనరసింహ, సుప్రపన్న నరసింహ అనేవారు నాలుగు దిక్కుల వెలసిఉన్నారని, మధ్యన యోగా నంద నృసింహుడు వెలసి ఉన్నాడని మేథావులు చెబుతుం టారు. జఫర్‌గడ్‌లో ప్రతిఏటా మే నెలలో శ్రీ వేల్పుకొండ నర సింహస్వామి జయంతి ఉత్సవాలతో పాటు శ్రావణమాసంలో నెలరోజుల పాటు అతి వైభవంగా జాతర మహోత్సవాలు జరుగుతాయి. దీనిని దేవుని గుట్టగా పిలుస్తారు.
లక్కమేడలు
పడమర కొండపైన కోట గోడ లోపల ఉన్న భవ నాలు, రాజమందిరాలను లక్కమేడలు అనే పేరుతో స్థానికులు పిలుస్తుంటా రు. రాజభవనాలు చుట్టూ రాణుల బాత్‌రూమ్‌లు, వాటికి కోనేరుల నుంచి నీటిని సరఫరా చేసేం దుకు ఏర్పాట్లు చేసినట్లు ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి.

-మొహమ్మద్ బాబా ఫక్రుద్దీన్
మన తెలంగాణ రిపోర్టర్, జఫర్‌గడ్, జనగామ జిల్లా, సెల్: 9951547141