Home దునియా భారీ టైర్

భారీ టైర్

Uniroyal Giant Tireఅమెరికాలోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన వారికి ఈ భారీ టైర్ కనువిందు చేస్తోంది. దాదాపు 80 అడుగుల ఎత్తున్న ఈ టైర్ డెట్రాయిట్‌కు చిహ్నంగా మారింది. నిజానికి దీనిని 1964లో న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్‌ఫెయిర్ సందర్భంగా తయారుచేశారు. అప్పట్లో దీనిని రంగుల రాట్నంగా ఉపయోగించారు. ఈ ఉత్సవాలు ముగిసిన తర్వాత దీనిని 188 భాగాలుగా విడదీసి డెట్రాయిట్‌కు తరలించారు. యూనిరాయల్ టైర్ కంపెనీ సేల్స్ ఆఫీసు ఎదుట దీనిని ప్రతిష్టించారు. అయితే, కాలక్రమంలో ఆ ఆఫీసు అక్కడి నుంచి తరలిపోయింది కానీ..ఈ టైర్ మాత్రం అక్కడే ఉండిపోయింది. దీనిని రబ్బరుతో తయారుచేయలేదన్న విషయం సందర్శకులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. యూనిరాయల్ అభివృద్ధి చేసిన పాలిస్టర్ రెజిన్, గ్లాస్ ఫైబర్‌తో కలిపి తయారుచేశారు. సిమెంటు, ఉక్కుతో తయారుచేసిన దిమ్మెలపై దీనిని నిలబెట్టారు. ఎంతటి తుఫానులు వచ్చినా ఇది చెక్కుచెదరదు. 50 ఏళ్లుగా ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
 
History Behind Michigan Uniroyal Giant Tire