Home దునియా యాపిల్ బాస్‌కు చేపల కూర

యాపిల్ బాస్‌కు చేపల కూర

Apple-boss

స్టీవ్ జాబ్స్. పరిచయం అక్కర్లేని పేరు. వరల్ మోస్ట్ వాల్యూబుల్ కంపెనీ ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు. అనేక రంగాలను ప్రభావితం చేసిన విజనరీ. రివల్యూషనరీ. సరికొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసిన ఇన్నోవేటర్. ఈ గాడ్ ఆఫ్ టెక్నాలజీ వ్యక్తిగత వివరాలు అంతగా ప్రచారంలోకి రాకపోవడం వల్ల చాలా మందికి అవి తెలియలేదు.
స్టీవ్‌జాబ్ మతం ఏమిటి?
ఏటి వివరాలు, మహర్షుల వివరాలు అడగకూడదు అని పెద్దలు చెప్పినా సామాజిక వర్గం అనేది ఎప్పుడూ ప్రతి ఒక్కరినీ వెంటాడుతునే ఉంటుంది. కొందరి విషయంలో అది ప్రాధాన్యం లేని విషయమే అయినా ఆసక్తిగల అంశాలలో ఇది కూడా ఒకటి. చాలామంది ఆయన విదేశీయుడు కనుక క్రైస్తవమతస్థుడు అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఆయన బౌద్ధ సన్యాసి. ఎప్పటినుంచో బౌద్ధం స్వీకరించాలని అనుకున్నాడు. కుదరలేదు. ఇలా కాదని 1974లో ఇండియాకు పనిగట్టుకువచ్చి తన కోరిక తీర్చుకున్నాడు. ప్రపంచంలో బౌద్ధదేశాలు అనేకం ఉన్నా బుద్ధుడు పుట్టిన చోటే ఈ పని జరగాలని అనుకున్నాడు. నిజం చేసుకున్నాడు.
ఫేవరెట్ డిష్
స్టీవ్ జాబ్స్ కు ఇష్టమైన ఆహారం చేపలకూర. క్యారెట్లు, పళ్లరసాలంటే కూడా ఇష్టమే. కానీఫ్రూటేరియన్‌గా ఉండాలన్నది ఆయన కోరిక. అందుకని శుద్ధ సాత్వికాహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టాడు. అంటే పళ్లు, విత్తనాలు, గింజలు, కూరగాయలు, ధాన్యాలు వగైరాలు మాత్రమే తిన్నాడు.
పెద్దగా చదువుకోలేదు
గొప్ప విజనరీగా, రివెల్షూనరీగా పేరున్న స్టీవ్ జాబ్స్ గొప్పగా చదువుకున్నదేలేదు. అంతపెద్ద పొజిషన్‌లో ఉన్న వాడు ఎంత పెద్ద చదువు చదువుకున్నాడో అని అనుకోడం, అపోహపడడ సాధారణమే! కానీ ఆయనో కాలేజీ డ్రాపవుట్. ఏడాదిన్నర మాత్రమే కాలేజీకి వెళ్లాడు. కెలీగ్రఫీ మీద, టైపోగ్రఫీ మీద ఆసక్తి ఉండేది. వాటి మీద పట్టు సంపాదించాడు.
చివరి మాటలు ఇప్పటికీ సస్పెన్సే
స్టీవ్ జాబ్స్ తుది శ్వాస విడిచేటప్పుడు ఏ మాట్లాడాడు అనేది ఇప్పటికీ మిస్టరీయే! ఓహ్ వావ్ ఆయన ఊతపదాలు వీటినే మూడు సార్లు రిపీట్ చేశాడంటారు.. అలా ఎందుకన్నాడో, అలా అనాలని ఎందుకనిపించిందో ఎవ్వరికీ తెలియదు.
సాదాసీదా డ్రెస్
స్టీవ్ జాబ్స్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది తాబేలు మెడలాంటి నల్లటి షర్టు, లెవిస్ జీన్స్, కాళ్లకు స్నీకర్స్. ఇదే ఆయన డ్రెస్ కోడ్. చూడడానికి ఎంతో సింపుల్‌గా ఉన్నా అవే ఆయనకు ఇష్టం. ఆయన వాడ్రోబ్ లో లెవిస్ జీన్స్ వంద వరకు ఉన్నాయంటారే నమ్ముతారా? కాని ఇది నిజం. జీవితాంతం బ్రాండ్ మార్చకుండా వాటినే ధరించాడు.
27 ఏళ్ల తర్వాత సోదరిని కలిశాడు
స్టీవ్ జాబ్స్ అందరి పిల్లల్లాగా అమ్మానాన్నల దగ్గరపెరగలేదు. వాళ్ళు లేక కాదు. ఉన్నా వారిదగ్గర పెరిగేందుకు కుదర్లేదు. అందుకే ఆయనను పెంచిన అమ్మానాన్నలు వేరయ్యారు. ఆయనకు మోనా సింప్సన్ అని ఒక సోదరి ఉంది. తోడబుట్టిన చెల్లెలే అయినా అదే ఇంట్లో పెరగనందుకు ఆమెను కలుసుకోడానికి జాబ్స్‌కు 27 ఏళ్లు పట్టింది.
ఆపిల్ పేరే ఎందుకు ?
జాబ్స్ పేరు చెప్పగానే గుర్తుకువచ్చేది యాపిల్ కంపెనీ! సగం తిన్న యాపిల్ బొమ్మ. ఈ బొమ్మ వెనక, ఆ పేరు వెనక ఆసక్తికరమైన కథ ఉంది. స్టీవ్.. ఎక్కువగా ఆర్గానిక్ ఫామ్ నుంచే ఆపిల్స్ తెప్పించుకునేవాడు. అలా ఒకసారి ఆపిల్ తోటకు వెళ్లినప్పుడు తన సంస్థకు ఆపిల్ అనే పేరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఎంతో రుచికరమైనది, బలవర్ధకమైనది, చూడడానికి ఎంతో అందంగా ఉండేది యాపిల్. తన కంపెనీకి కూడా ఇలాంటి లక్షణాలే ఉండాలని కోరుకునేవాడు. ఈ సంస్థ అభిరుచి కలిగిన వ్యక్తులలో నిండిపోవాలని, కొత్తకొత్త ఉత్పత్తులతో జనంలో అభిరుచి కలిగిన జీవితం పట్ల ఆసక్తి కలిగించాలని ఆయన కోరుకున్నాడు. అలా అతనికి ఇష్టమైన పండుపేరే కంపెనీ పేరుగా ఫిక్సయిపోయింది.
ఆపిల్ వదిలేసి మళ్లీ వచ్చాక
ఆధిపత్య పోరు మూలంగా స్టీవ్ జాబ్స్ సొంతకంపెనీ నుంచి వైదొలిగాల్సివచ్చింది. ఆ తర్వాత ఆపిల్ తీవ్ర సంక్షోభంలో ఉన్న టైంలో మళ్లీ సొంతగూటికి చేరుకున్నాడు. 1997లో స్టీవ్ రాక సంస్థకు ఎంతో కలిసొచ్చింది. దివాలా తీసే టైంలో కంపెనీని లాభాల బాట పట్టించాడు. సంస్థ సీఈవోగా ఉన్న ఆ రోజులు.. తన జీవితంలో మోస్ట్ క్రియేటివ్ పీరియెడ్ అంటాడు.
చండశాసనుడు
స్టీవ్ జాబ్స్ టఫ్ బాస్. రూలంటే రూలే. పద్ధతంటే పద్ధతే. కష్టమో నిష్ఠురమో ఫాలో అవుతాడు..ఎలా ఫాలో అవ్వాలో చెబుతాడు. ఫాలో అవ్వాలని చెప్తాడు కూడా! తేడా వస్తే మాత్రం అగ్గిబరాటాలా మారిపోతాడు.
ఎమోషన్స్ కోసం స్పెషల్ టీం
ఎమోషన్స్ స్టడీ చేయడానికి స్టీవ్ జాబ్స్ కి ఒక స్పెషల్ టీం ఉండేది. ప్రతీ ప్రాడక్టుకి సంబంధించి అది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ రకమైన చెకప్ ఆపిల్ ఉత్పత్తుల్లో ఇప్పుడు సర్వసాధారణ మైంది.
ఎన్ని పేటెంట్స్ ఉన్నాయంటే
స్టీవ్ జాబ్స్ కు దాదాపు 300 పేటెంట్ హక్కులున్నాయి. ఆపిల్ స్టోర్ లో గ్లాస్ స్టెయిర్ కేసు అందులో అన్నిటికంటే ప్రత్యేకమైంది. స్టోర్ లోకి రప్పించడానికి అదొక స్పెషల్ అట్రాక్షన్.