Search
Friday 16 November 2018
  • :
  • :

పల్టీ కొట్టిన బోగ్గు లారీ

larry
కారేపల్లి: సింగరేణి మండల పరధిలోని గిద్దవారిగూడెం స్టేజి వద్ద గేదెలు అడ్డు రావటంతో వాటిని తప్పించబోయి బోగ్గు లారీ పల్టీ కొట్టిన సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… భధ్రాధ్రి కొత్తగూడెం జిల్లా కొయ్యగూడెం ఓసి వద్ద నుండి బోగ్గు లోడుతో జగ్గయ్యపేట వెళ్ళాల్సి ఉండగా ఈ క్రమంలో ఇల్లెందు నుండి ఖమ్మం ప్రధాన రహాదారి గిద్దవారిగూడెం స్టేజి వద్ద తెల్లవారు జామున అడ్డుగా వచ్చిన గేదెను తప్పించబోయి లారీ పల్టీ కొట్టింది. ఈక్రమంలో డ్రైవర్ శివకుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి, లారీ పల్టీ కొట్టిన సంఘటన తెలుసుకున్న ఎస్‌ఐ అన్నం కిరణ్‌కుమార్ ఘటన స్ధలానికి చేరుకోని విచారించారు. రాత్రివేళలలో గేదెలు, ఆవులు, ఎటువంటి జీవాలను వదిలినట్లయితే వాటిని ఎవరివి అని విచారణ చేబట్టి భాధితులపై కేసు నమోదు చేస్తామని కారేపల్లి ఎస్‌ఐ తెలిపారు.

Comments

comments