Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇంటి వద్దనే హెచ్‌ఐవి టెస్టు

HIV-Test

హెచ్‌ఐవి తమకు ఉందా లేదా అని ఎవరైనా ప్రాథమికంగా తమ ఇంటివద్దనే తమకు తాము‘ఓరల్ క్విక్’ అనే కిట్ ద్వారా పరీక్షించుకోడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అవకాశం కల్పించింది. ఒరాకిల్ కిట్ ద్వారా నోటిలోని లాలాజలం సేకరించి హెచ్‌ఐవి వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అన్నవి తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో కేవలం 20 నుంచి 40 నిముషాల్లోనే ఫలితాలు తెలుస్తాయి. వీరిలో 2,40,000 మంది తాము హెచ్‌ఐవి బాధితులమన్న వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. పరీక్షలకు ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుందని జంకుతున్నారని అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఈ కిట్ ద్వారా సులువుగా పరీక్షలో బాధితులు స్వయంగా చేసుకోవచ్చు. ఇప్పుడున్న కొన్ని లక్షలమంది హెచ్‌ఐవి రోగులకు తోడు మరో 50వేల మంది వంతున ఏటా కొత్తగారోగులు జాబితాలో వచ్చి చేరుతున్నారు. ఈ మెడికల్ కిట్లు ఉన్నవారు అవసరమనుకుంటే వైద్యుల ద్వారా మెడికల్ కేర్‌సెంర్లలో పరీక్షలు చేయించుకోవచ్చని డాక్టర్లు చెప్పారు. ఈ కిట్ ద్వారా ఫలితాలు నూటికి నూరుశాతం నిర్థారణ కాకపోవచ్చు. 92 శాతం వైరస్ ఉన్న వారికి ఈ పరీక్ష కొంతవరకు ఉపయోగపడుతుంది. చూచాయిగా లక్షణాలు ఉన్నవారిలో ఇది వైరస్ కనుక్కోలేదు.

మన తెలంగాణ,సైన్స్  విభాగం

Comments

comments