Home తాజా వార్తలు జైలు నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేశారు…

జైలు నుంచి బయటకు రాగానే అరెస్ట్ చేశారు…

JAIL

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో అరెస్టు అయిన హెచ్‌ఎండిఎ ప్లానింగ్ విభాగం పూర్వ సంచాలకుడు పురుషోత్తమ్‌రెడ్డి గురువారం సాయంత్రం బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఎసిబి అధికారులు మరో కేసులో పురుషోత్తమ్ రెడ్డిని జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. ప్లానింగ్ విభాగం అధికారి భీంరావు కేసులో పురుషోత్తమ్ రెడ్డిపై మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే పురుషోత్తమ్ రెడ్డి గతంలోనే అరెస్టు అయ్యారు.