Search
Wednesday 14 November 2018
  • :
  • :

హెచ్‌ఎండిఎలో పదోన్నతులకు పైరవీలు!

యూనిఫైడ్ సర్వీసు నేపథ్యం
పావులు కదిపిన నలుగురు అధికారులు
అందుకు ఓ ఉన్నతాధికారి మద్దతు
గత కమిషనర్ తిరస్కరణ
రుజువులు కావాలన్న ప్రస్తుత కమిషనర్

pramotion

మన తెలంగాణ/ సిటీబ్యూరో : నియమనిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులను పొందేందుకు వేదికగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ) మారుతోంది. నియమనిబంధనలు లేకున్నా… ప్రభుత్వ సూత్రాలు రాకున్నా తమ కు పదోన్నతిని ఇవ్వాలని పరిపా లనాధికారులు రహాస్యంగా పావు లు కదిపినట్టు అథారిటీ వర్గాల్లో ఆశ్చర్యకరమైన ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా నలుగురు అధికారులు గట్టి ప్రయత్నం చేస్తు న్నట్టు, అందుకు ఓ ఉన్నతాధికారి కూడా మద్దతు నిస్తున్నట్టు తెలిసింది. సోమవారం రోజున కమిషనర్ చిరంజీవులు వద్దకు ఫైలును పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ పదోన్నతుల వెనుక పెద్దమొత్తంలో అవినీతి చేతులు మారిన ట్టు కార్యాలయ వర్గాల్లో చర్చకు తెరలేచింది. ఈ నలుగురు అధికారులు గతంలో పనిచేసిన కమిషనర్ ప్రదీప్‌చంద్ర హయాంలోనూ తమకు పదోన్నతిని కల్పించాలని అర్జీ(ఫైల్ నెం.1413)పెట్టికుంటే ప్రభుత్వం నుండి గైడ్‌లైన్స్ లేవని, మీకు ఆ అవకాశంలేదని తేల్చిచెప్పినట్టు కూడా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2013లోనే వీరు దరఖాస్తుచే సుకున్నా ప్రభుత్వంలో ఉన్న గైడ్‌లైన్స్‌ను పరిశీలించిన అప్ప టి కమిషనర్ వీరిని తిరస్కరించినట్టు అథారిటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
యూనిఫైడ్ సర్వీసు నేపథ్యం…
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే యూనిఫైడ్ సర్వీస్‌ను కార్య రూపంలోకి తీసుకొస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొందరు అథా రిటీ అధికారులు పదోన్నతిని పొందేందుకు ఇదే సరైన సమయమని భావించి, తమతమ గాడ్‌ఫాథర్‌ల ద్వారా కమి షనర్‌పై వత్తిడి తీసుకొస్తున్నట్టు చర్చ జరుగుతుంది. యూని ఫైడ్ సర్వీసు అమలులోకి వస్తే ఇప్పుడొచ్చిన పదోన్నతితో ఉన్నతస్థాయి అధికారి హోదాతో ఇతర విభాగాలకు వెళ్ళవచ్చనేది వారి ఆలోచనగా ఉన్నదనేది సహోద్యోగుల భావన. వీరు పరిపాలనా విభాగంలో పనిచేస్తున్నారని, వీరిని ప్రస్తుత కమిషనర్ చిరంజీవులు పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. మీకు పదోన్నతిని ఇవ్వవచ్చని ఏదేని నియమం ఉన్నదా..? సర్వీసు నియమాలు అథారిటీలో ఉన్నాయా…? ఇదే కేటగిరిలోని వారు చట్టం ప్రకారం గతంలో పదోన్నతిని పొందినట్టు రుజువులున్నాయా..? అని చిరంజీవులు వారిని అడిగినట్టు తెలిసింది.
ఆరోపణలు…
ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను తీసుకునే ప్రక్రియపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రక్రియకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఓ అధికారి ఇప్పుడు పదోన్నతి పొందే వారి జాబితాలో ఉండటంపై అధికార వర్గాలు పెదవివిరుస్తున్నాయి. కమిషనర్ చెప్పిన వారికేమో సెక్యూరి టీగార్డుగా చేయాలని, ఆయన ఎంపికచేసుకున్న వారికేమో పరిపాలనా విభాగంలో పనిచేసే కొలువులను కేటాయి స్తున్నట్టు బలమైన ఆరోపణలకు కేంద్రంగా ఉన్నవారికి పదోన్నతిని కల్పిస్తే కమిషనర్‌పై కూడా విమర్శలు వచ్చే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాయి. మరి కమిషనర్ చిరంజీవులు వారికి ఏమేరకు పదోన్నతి కల్పిస్తారో వేచి చూడాలి.

Comments

comments