Home హైదరాబాద్ నోటీసులిచ్చినా బేఖాతర్!

నోటీసులిచ్చినా బేఖాతర్!

HMWS

వ్యాపార సంస్థలపై కఠినచర్యలకు జలమండలి సిద్ధం
సిల్ట్ చాంబర్లు కట్టకుంటే డ్రైనేజీ కనెక్షన్ కట్
డైనేజీ ఓవర్ ప్లోకు మరమ్మతులు నో
ఆహార వ్యర్థాలు మేట వేయడం వల్లనే మురుగు పొంగుతోందని గుర్తించిన జలమండలి

సిటీబ్యూరో: నగరంలోని హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఆసుపత్రులు, వ్యాపార, వాణిజ్య సంస్థ యజమాన్యాలు విధిగా సిల్ట్ ఛాంబర్లను నిర్మించుకోవాలని, లేనిపక్షంలో ఆయా సంస్థలకు చెందిన డ్రైనేజీ కనెక్షన్లు నిలిపివేయాలని, డైనేజీ ఓవర్ ప్లోకు  మరమ్మతు చేపట్టరాదని జలమండలి నిర్ణయించింది. జలమండలి ఆధ్వర్యంలో మినీ జెట్టింగ్ మిష న్లు అందుబాటులోకి తీసుకొచ్చినా తరువాత కూడా నగరంలో మురుగు నీటికి సంబంధించిన ఫిర్యాదులు తగ్గడం లేదు. మురు గు సమస్యలపై దృష్టి సారించిన జలమండలి  నగరంలో తరచూ మురుగు నీరు ఎందుకు పొంగిపొర్లుతుందన్న దానిపై సర్వే నిర్వహించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు,బార్ అండ్ రెస్టారెంట్లు, ఆసుపత్రులు వ్యాపార, వాణిజ్య సంస్థ నుంచి చెత్తచెదారం, ఆహార వ్యర్ధాలు డ్రైనేజీ పైపులైన్లలో చేరుతుండటంతో మురుగునీరు  సాఫీగా వెళ్లడం లేదని తేలింది. ఈ కారణంగానే డ్రైనేజీలు పొంగిపొర్లుతూ మురుగు నీరు బస్తీలు, కాలనీలు, రోడ్లపై ప్రవాహిస్తోందని వెల్లడైంది.

ప్రధానంగా డ్రైనేజీ  పైపులైన్లలో ఆహార వ్యర్ధాలు మేట వేయడం వల్లనే  మురుగు పొంగుతుందని జలమండలి గుర్తించింది.  సిల్ట్ ఛాంబర్లు నిర్మించడం ద్వారానే  మురుగు సమస్య పరిష్కరం  లభిస్తుందని బోర్డు నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నగరంలో ఉన్న  హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఆసుపత్రులు, వ్యాపార, వాణిజ్య సంస్థ యజమాన్యాలు విధిగా సిల్ట్ ఛాంబర్లను నిర్మించుకోవాలని ఆయా సంస్ధ్థలకు నోటీసులు జారీ చేసింది. సొంత ఖర్చుతో తమ తమ ప్రాంతాలలో సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలని నోటీసుల ద్వారా ఆయా యజమాన్యాలను ఆదేశించింది.  ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 1500 భవనాలకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇందులో  650 భవన యజమాన్యాలు ముందుకు వచ్చి సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోగా, మిగితా వారు స్పందించడం లేదు.

దీనిని సీరియస్‌గా పరిగణించిన జలమండలి సిల్ట్ ఛాంబర్ల నిర్మాణానికి  ముందుకు రాని సంస్ధలకు సంబంధించిన  డ్రైనేజీ కనెక్షన్లు నిలివేయాలని నిర్ణయించింది. రెండవ విడుత నోటీసుల జారీ చేసిన తరువాత కూడ ఆయా సంస్థలు సిల్ట్ చాంబర్ నిర్మించకుంటే వాటి తాలుకూ డ్రైనేజీ కనెక్షన్ తొలగించనుంది. అలాగే ఆయా సంస్థ వద్ద  డైనేజీ ఓవర్ ప్లో ఏర్పడి మురుగు సమస్య తలెత్తిన బోర్డు సిబ్బంది మరమ్మతు చేపట్టరాదని నిర్ణయించింది.  నగరంలో తరుచూ డ్రైనేజీ  సమస్యలు తలెత్తే ఈ  ప్రాంతాలను జలమండలి హాట్ స్పాట్‌లుగా గుర్తించింది.ఆయా హాట్‌స్పాట్‌ల పరిధిలో సిల్ట్ ఛాంబర్లు నిర్మించడానికి ముందుకు రాని సంస్థలకు సంబంధించి డ్రైనేజీ  మరమ్మతు పనులు చేయకుండా నిలిపివేయాలని బోర్డు యోచిస్తోంది.  ఆయా ఏరియాలో ్లని సంస్ధలు  సిల్ట్ ఛాంబర్లను  నిర్మించకుంటేనే  వాటికి సంబంధించి డ్రైనేజీ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది.