Search
Saturday 22 September 2018
  • :
  • :

పాక్‌ను చిత్తుచేసిన భారత్…

india-beat-pakisthan-4-0

బ్రెడా: హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. టోర్నీ ఏదైనా సరే ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే ఆధిపత్యం ఇండియాదేనని మరోసారి రుజువు చేసింది. శనివారం జరిగిన తొలి పోరులో భారత్ 4-0 తేడాతో పాక్‌పై విజయం డంకా మోగించింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. మన్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ చెరో గోల్ కొట్టి భారత్‌ను విజయంవైపుకు నడిపించారు. తొలి క్వార్టర్ 25వ నిమిషంలో తొలి గోల్ చేసిన భారత్ మిగతా 3 గోల్స్‌ను ఆట చివరి ఐదు నిమిషాల్లో చేయడం గమనార్హం. గోల్ చేయడానికి పాకిస్థాన్ కు భారత డిఫెండర్లు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. 6 దేశాలు పోటీపడుతున్న టోర్నమెంట్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడబోతోంది.

Comments

comments