Home రంగారెడ్డి నగరంలో రంగుల వాన

నగరంలో రంగుల వాన

 హోలీ వేడుకల్లో మునిగి తేలిన యువత  సప్తవర్ణ శోభితమైన రోడ్లు, బస్తీలు, పార్కులు

holiమన తెలంగాణ / సిటీబ్యూరో : నగరంలో హోలీ వేడుకలు మిన్నాంటాయి. కుల ,మతలకు అతీతంగా నగర వాసులు హోలీ వేడుకలను ఆనందోత్సహాలలో ము నిగితేలారు. ఈ సందర్భంగా చిన్న పేద అన్ని తేడా కుండా ఒక్కరిపై ఒక్కరు రంగులు చల్లుకున్ని పర్వశించి పోయ్యారు. దీంతో నగరంలో రంగుల వాన కురిసి సప్తవర్ణశోభితమైంది. రోడ్లు, పార్కులు బస్తీలు అపార్టుమెంట్లు ఎక్కడా చూసిన రంగులు చల్లుకుంటూ కేరింతలు, ఆట పాటాలతో మునిగిం తెల్లారు. నెక్లెస్ రోడు, తో పాటు ప్రధాన పా ర్కులు, హోటళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోలీ సంబరాలల్లో ఐటి ఉద్యోగులు, ఉద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆట పాటాలతో సరదాగా గడిపారు. అదేవిధంగా నగరంలోని పలు అపార్టుమెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో అపార్టుమెంట్ వాసులు హోలీ వేడులల్లో పాల్గొ ని సరదా సరదా చేశారు. ఇక బస్తీల్లో హోలీ సంబురాలు వెల్లువి రిసా యి. చిన్నా, పెద్ద అన్నా తేడా లేకుండా బస్తీలకు బస్తీలే రంగుల మ యం అయ్యాయి. టెన్త్ పరీక్షల నేపథ్యంలో చాలా మంది విద్యా ర్థులు హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారు. బేగంపేట్ దేవ్‌నగర్ బ్లైండ్ పాఠశాలల్లో జరిగిన హోలీ వేడుకల్లో పలువురు విదేశీయులు చిన్నా రులతో హోలీ ఆడారు. ప్రజలతో పాటు వివిధ పార్టీ నాయకులు, మం త్రులు, హోలీ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడులకను ఘనంగా జరుపుకున్నారు. బిజె పి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్ని సందండి చేశారు. అదేవిధంగా ఎన్టీర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన హోలీ సంబురాలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , తెలంగాణ టిడిపి రాఫ్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
హెచ్‌సియు విద్యార్థులు హోళీకి దూరం :
ప్రతి సారి హోలీ వేడుకల్లో మునిగి తేలే హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం విద్యార్థులు ఈసారి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్ప డింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల చెందిన విద్యార్థులు చదువుకున్నే విష యం తెలిసిందే. ప్రతి సారి అక్కడివిద్యార్థులు తమ తమ ఆచారాల ప్ర కారం హోలీ వేడుకలు జరుపుకున్నేవారు. అయితే ఈ సారి అక్కడ పూర్తిగా ఉద్రికత్త పరిస్థితులకు తోడు విశ్వవిద్యాలయానికి సెల వు ప్రకటించడం, పోలీసులను మోహరించడంతో హోలీ వేడుకలు జరుపు కోవాల్సిన విద్యార్థులు తిండికి కూడా దూరమై బిక్కుబిక్కు మంటు గడిపారు.