Home జాతీయ వార్తలు బ్యాంకులకు వరుస సెలవులు

బ్యాంకులకు వరుస సెలవులు

Holidays to Banksఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలు శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. వరుస సెలవులు, సమ్మెలతో బ్యాంకులు మూతబడనున్నాయి. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం  సమ్మెకు పిలుపునివ్వడంతో శుక్రవారం బ్యాంకులు పనిచేయవు. డిసెంబరు 22 నాలుగో శనివారం, డిసెంబరు 23 ఆదివారం కావడంతో బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. డిసెంబరు 24 మాత్రం బ్యాంకులు పనిచేస్తాయి.  డిసెంబర్ 25న క్రిస్మస్‌ సెలవు ఉండడంతో బ్యాంకులు పనిచేయవు. డిసెంబరు 26న  యూఎఫ్‌బీయూ  సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో  ఈ రోజు కూడా బ్యాంకులు పని చేయవు. సోమవారం మినహా డిసెంబరు 21 నుంచి 26 వరకు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.  వరుస సెలవులతో ఎటిఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎటిఎంలలో నగదు కొరత ఏర్పడకుండా చూడాలని వినియోగదారులు బ్యాంకర్లను కోరుతున్నారు.

Holidays to Banks