Search
Saturday 17 November 2018
  • :
  • :

హాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత

LEVIS

లండన్ : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నిర్మాత లెవిస్‌గిల్‌బర్ట్ (97) బుధవారం కన్నుమూశారు.  ఈ విషయాన్ని బాండ్ సినిమాల నిర్మాత మైఖేల్ జీ విల్సన్ తెలిపారు. లెవిస్‌గిల్‌బర్ట్ మృతిపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. జేమ్స్ బాండ్ సిరీస్‌లో ‘ యు ఓన్లీ లైవ్ ట్వైస్ ’, ‘ ది స్పై హూ లవ్‌డ్ వి’, ‘ మూన్‌రాకర్ ’ వంటి ఎన్నో సినిమాలకు లెవిస్‌గిల్‌బర్ట్ దర్శకత్వం వహించారు. 60 ఏళ్లలో ఆయన 40కి పైగా చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. 1920లో లండన్‌లోని హాక్నీలో ఆయన జన్మించారు. స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన మృతిపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Hollywood Director Levisgilbart  Passes Away

Comments

comments