Home తాజా వార్తలు హోంగార్డు ఆత్మహత్య

హోంగార్డు ఆత్మహత్య

SUICIDE

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లంతకుంట పోలీసు స్టేషన్‌లో అనుముల సంతోష్ (30) హోంగార్డుగా పని చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగానే సంతోష్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంతోష్‌కు భార్య , ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు విచారిస్తున్నారు.