Home జాతీయ వార్తలు ఆ హోంశాఖ మంత్రి నన్ను బూతులు తిట్టాడు

ఆ హోంశాఖ మంత్రి నన్ను బూతులు తిట్టాడు

Deepak-Vasanth-Sarkar

ముంబయి: ప్రజలకు సేవ చేయాల్సిన మంత్రి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహారాష్ట్ర చెందిన హోంశాఖ మంత్రి దీపక్ వసంత్ కేసర్కార్ తనను అసభ్యపదజాలంతో తిట్టాడని ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… గత సంవత్సరం మే నెలలో ఓ మహిళ, ఆమె కూతురుకు దుండగులు మత్తు ఇంజక్ష్లను ఇచ్చి వారిపై గ్యాంగ్ రేప్ చేశారు. దీంతో తనపై అఘాయిత్యం జరిగిందని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించి మిగతా వారిని వదిలిపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె మంత్రి వద్దకు వెళ్లి తన బాధను తెలిపింది. దీంతో మంత్రి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నీ రేటుంతా,  ఇక్కడ మాట్లాడొద్దని, బూతులు తిట్టాడని వెల్లడించింది. దీంతో సదరు మహిళ మెరైన్ పోలీస్ స్టేషన్ లో హోంమంత్రి పై ఫిర్యాదు చేసిందని అక్కడి పోలీసులు తెలిపారు. మంత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొందన్నారు.

 ఈ సంఘటనపై మంత్రి మాట్లాడారు. సదరు మహిళ తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందని, ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు 20 మంది ఉన్నారని తెలిపారు. ఆమె సాయం చేయడానికి రడీగా ఉన్నానని, ఆమెకు న్యాయం జరిగేలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడ ఏమి జరిగిందో అందరూ చూశారని ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని మీడియాకు తెలిపారు.

Home Minister Misbehave with Women

Telangana news