Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

హోంమంత్రి కూలీ రూ.6.60 లక్షలు

Nayini

ముషీరాబాద్ : నేడు వరంగల్‌లో జరుగనున్న టిఆర్‌ఎస్ ఆవిర్భవ బహిరంగసభ నిర్వాహణకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు వ్యాపార సంస్థ్ధల్లో, నివాసాల్లో, హోటల్లో కూలి పని చేసారు. ఇందులో భాగంగా విద్యానగర్ నియో బిబిసి ఆసుపత్రిలో నాయిని స్థానిక కార్పొరేటర్ హేమలతారెడ్డితో కలిసి కూలి పని చేశారు. ఇందుకు ఆసుపత్రి యజమాని డాక్టర్.రంగయ్య రూ.51 వేల చెక్‌ను నాయినికి అందచేసారు. అలాగే రాంనగర్ శ్రీనివాస శారీ హౌస్‌లో నాయిని కూలి పని చేయగా, యజమాని యాదగిరి రూ.51 వేల చెక్‌ను అందచేసారు. అడిక్‌మెట్ బయాలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీలో కూలి పని చేయగా, నిర్వాహకులు ప్రసాద్  లక్ష రూపాయల చెక్‌ను అందచేశారు. కర్ష ప్రింటింగ్ ప్రెస్‌లో కూలి పని చేసిన నాయిని రూ.50 వేల సంపాదించారు.

రాంనగర్ డివిజన్ హరినగర్ వద్ద గల మోరిన్ కేఫ్ హోటల్‌లో స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నాయిని చాయ్ అమ్మాడు. అందుకుగాను హోటల్ యజమాని మహ్మద్ జహంగీర్ రూ.21 వేల కూలి ఇచ్చారు. అలాగే రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి అరోరా కళాశాల మరో అదనపు భవన నిర్మాణం వద్ద వీఎస్‌ఆర్ యువసేన అధ్యక్షులు బాలు యాదవ్ ఆధ్వర్యంలో నాయిని కూలి పని చేశారు. బిల్డర్ సంజయ్ నాయినికి రూ.2.35 లక్షల చెక్‌ను అందచేసారు. అటు కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు మార్గంలో గల స్నో వరల్డ్‌లో నాయిని నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ లాస్యనందితతో కలిసి చిన్నారులకు ఐస్ క్రీమ్‌లు, తినుబండారాలను అమ్మి కూలి పని చేశారు. అందుకుగాను స్నో వరల్డ్ ఎండి.చంద్రమౌళి నాయిని, కార్పొరేటర్ లాస్యనందితకు రూ.లక్ష రూపాయల చెక్‌ను అందచేశారు. నియోజకవర్గంలో చేసిన కులిపనికి రూ.6.60 లక్షల రూపాయలను నాయిని సంపాదించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు ఎస్.యాదగిరి, జయరాంరెడ్డి, శ్యామ్ యాదవ్, నేత శ్రీనివాస్, మహ్మద్ ఖదీర్, సిరిగిరి శ్యామ్, మహ్మద్ అహ్మద్, కడప సురేందర్, ఎ.శ్రీనివాస్ పాల్గొన్నారు.

Comments

comments