Search
Wednesday 21 November 2018
  • :
  • :

హోంగార్డుల సంక్షేమానికి కృషి : నాయిని

NAINI

హైదరాబాద్ : తెలంగాణలో హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయిని మాట్లాడారు. హోంగార్డుల జీతభత్యాలు ఎప్పటికప్పుడూ పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. వారికి జీవిత బీమా ప్రీమియంను కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామన్నారు. హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విధుల్లో హోంగార్డులు మరణిస్తే, వారి పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నట్లు నాయిని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిలో హోంగార్డులు మరణిస్తే ముప్పై లక్షల పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments