Search
Friday 21 September 2018
  • :
  • :

హోండా సిబిఆర్150ఆర్, సిబిఆర్250ఆర్

honda-cbrహొండా రెండు కొత్త బైక్‌లను విడుదల చేసింది. సిబిఆర్150ఆర్, సిబిఆర్250ఆర్ బైకులను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఆకర్షణీయమైన రంగుల్లో, కొత్త బాడీ డిజైన్లతో ఈ బైకులు వినియోగదారులకు అందుబాటులోకొచ్చాయి.
సిబిఆర్150ఆర్
సిబిఆర్150ఆర్ ధర రూ. 1,29,662 (ఎక్స్-షోరూమ్ ముంబయి)గా ఉంది. ఈ బైకు 149సిసి సామర్థం గల సిలిండర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో ఉన్న ఇంజన్ కలిగి ఉంది. దీని మైలేజ్ కిలోమీటర్‌కు 40కెఎమ్‌పిఎల్ ఇస్తుంది. ఈ బైకు 18.28బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసి, 12.66ఎన్‌ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి ఆరు గేర్లు , ఎలక్ట్రిక్ స్టార్ట్, క్లాక్, అల్లో వీల్స్, డిస్క్ (ఫ్రంట్, రియర్) బ్రేకులు , ట్యూబ్‌లెస్ టైర్లు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఇంధన సామర్థం 13 లీటర్లు ఉండగా, దీని గరిష్ఠ వేగం 109కెఎమ్‌పిహెచ్‌గా ఉంది. ఈ బైకు బరువు 138కిలోగ్రాములుగా ఉంది. దీని పొడవు 2000ఎమ్‌ఎమ్, వెడల్పు 112oఎమ్‌ఎమ్, సీటు ఎత్తు 795ఎమ్‌ఎమ్, వీల్ బేస్ 1305ఎమ్‌ఎమ్, గ్రౌండ్ క్లియరెన్స్ 190ఎమ్‌ఎమ్‌గా ఉన్నాయి. ఇది జాజి, బ్లూ మెటాలిక్, స్పోర్ట్ రెడ్, క్యాండీ ఫామ్ గ్రీన్ కలర్స్‌లలో లభిస్తుంది.
సిబిఆర్ 250ఆర్
ఈ బైకుకు 249సిసి గల సిలిండర్ లిక్విడ్ కూల్ ్డ ఇంజిన్ కలదు. దీని ధర రూ.1,60,201 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇది 26.15 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసి, 22.9ఎన్‌ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ బైకు ఆరు గేర్లు ఉన్నాయి. ఇంధన ట్యాంకు కెపాసిటి 13 లీటర్లుగా ఉంది. ఈ బైకు గరిష్ఠ వేగం 145 కెఎమ్‌పిహెచ్‌గా ఉంది. డిస్క్ (ఫ్రంట్, రియర్) బ్రేకులు, ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లో వీల్స్, ఫ్రంట్ టైరు (110/70 17M/C) రియర్ టైరు (140/70 17M/C)గా, ఎలక్ట్రిక్ స్టార్ట్, పిల్లియన్ ఫుట్‌రెస్ట్, పాస్ లైట్, స్టెప్ ఆప్ సీటు, స్ప్లీట్ సీటు తదితర సౌకర్యాలు ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటి 6ఎహెచ్, వోల్టేజ్ 12విగా ఉంది. ఈ బైకు పొడవు 2302ఎమ్‌ఎమ్, వెడల్పు 720ఎమ్‌ఎమ్, ఎత్తు 1127ఎమ్‌ఎమ్, గ్రౌండ్ క్లియరెన్స్ 145ఎమ్‌ఎమ్, సీటు ఎత్తు 780ఎమ్‌ఎమ్, వీల్‌బేస్ 1367ఎమ్‌ఎమ్‌గా ఉన్నాయి. అదేవిధంగా, ఈ బైకు బరువు 163 కిలోగ్రాములుగా ఉంది. హైవేలో 35కెఎమ్‌పిఎల్, సిటిలో 25కెఎమ్‌పిఎల్ మైలేజీని ఇస్తుంది. ఈ బైకు స్పోర్ట్ రెడ్, పియర్ల్ అమేజింగ్ వైట్, బ్లాక్ కలర్స్‌లలో లభిస్తుంది.

Comments

comments