Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

ఫోన్‌కు ఎయిర్‌బ్యాగ్‌లు!

Honda Makes First Smartphone Case with Emergency Airbag

స్మార్ట్‌ఫోన్ ఒక్కసారి కిందపడితే ఇంక అంతేసంగతులు. మళ్లీ అంత ఖరీదు పెట్టి కొత్తది కొనాల్సిందే. కానీ అలాంటి భయం అవసరం లేదంటున్నారు జర్మనీకి చెందిన ఫిలిప్ ఫ్రెంజెల్. అలెన్ యూనివర్సిటీలో చదువుతున్న ఫిలిప్ ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ కేస్‌ను తయారుచేశాడు. దీనికి యాక్టివ్ డంపింగ్ (ఏడీ) అని పేరు పెట్టారు. ఇది సాధారణ పౌచ్‌ల మాదిరిగానే ఉంటుంది. ఫోన్ కింద పడుతున్నప్పుడు ఏడీ కేస్‌లోని సెన్సర్లు గుర్తిస్తాయి. వెంటనే కేస్ నాలుగువైపుల నుంచి సాలెపురుగు కాళ్లలాగా నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు బయటకు వచ్చి ఫోన్ పగిలిపోకుండా కాపాడతాయి. ఫోన్‌ను తీసుకున్న తర్వాత ఆ ఎయిర్‌బ్యాగ్‌లను మడతపెట్టి మళ్లీ కేస్‌లో అమర్చుకోవచ్చు. త్వరలోనే ఇది మార్కెట్‌లోకి రానుంది.

Comments

comments