Home జాతీయ వార్తలు పంజాబ్‌లో హనీప్రీత్ అరెస్టు

పంజాబ్‌లో హనీప్రీత్ అరెస్టు

                 Honey-Preeti

ఛండీగఢ్: నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో గడుపుతున్న డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్‌ను మంగళవారం పంజాబ్‌లోని జిరక్‌పూర్ పాటియాల రోడ్డులో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాం క తనేజ అలియాస్ హనీప్రీత్‌ను అరెస్టు చేసినట్లు హర్యానా పోలీస్ డిజిపి బి.ఎస్.సంధు  ధ్రువీకరించారు. డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు న్యాయస్థానం జైలుశిక్ష విధించనప్పటి నుంచి హనీప్రీత్ అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె కోసం హర్యా నా పోలీసులు గాలిస్తున్నారు. అత్యాచారం కేసులో  డేరా బాబా  అరెస్టు అనంతరం పంచకులలో చెలరేగిన హింసాకాండలో 41 మంది చనిపోయారు. ఆ అల్లర్ల కేసులో హనీప్రీత్ పోలీసులకు కావలసిన వ్యక్తి. పోలీసుల  వాంటెడ్ లిస్ట్‌లో హనీప్రీత్ టాప్‌లో ఉన్నారు. సిట్ ఇన్‌ఛార్జి ముకేశ్ కుమార్ ఆమెను కస్టడీలోకి తీసుకు న్నారని పోలీస్ కమిషనర్ ఎ.ఎస్.చావ్లా పంచకులలో మీడియా వ్యక్తులకు తెలిపారు.  హనీప్రీత్‌ను బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచ నున్నారు. కోర్టులో ఆమె రిమాండ్‌ను కోరనున్నట్లు చావ్లా తెలిపారు.