Home తాజా వార్తలు హనీప్రీత్‌పై దేశ ద్రోహం కేసు…

హనీప్రీత్‌పై దేశ ద్రోహం కేసు…

Honeypreet-Singh

చండీగఢ్: హర్యానా పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయిన డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ఇన్సాన్‌ను బుధవారం పోలీసులు పంచకుల కోర్టులో హాజరుపరిచారు. ఇక గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చడంతో ఆయన అనుచరులు హర్యానా, పంజాబ్‌లో హింసకాండ సృష్టించారు. ఈ హింసను ప్రేరేపించింది హనీప్రీత్ అని ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. కోర్టు హనీప్రీత్‌కు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించింది. కోర్టులో హనీప్రీత్ కన్నీరు పెట్టుకున్నారు. డేరా అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అంతేగాక తండ్రిలాంటి గుర్మీత్‌తో తనకు అక్రమసంబంధం ఉందనడం తనను కలిచివేసిందన్నారు.

Honeypreet charged with sedition and 6 day Police Custody.