Home తాజా వార్తలు తేనే టీగల దాడితో బోలోరా వాహనం బోల్తా

తేనే టీగల దాడితో బోలోరా వాహనం బోల్తా

 Honeys Attack on Driver In Siddipet District

కొండపాక:  తేనేటీగలు బోలోరా డ్రైవర్‌పై దాడి చేయడంతో వాహనం బోల్తా పడిన సంఘటన మండల కేంద్రమైన కొండపాక శివారులోని రాముల గుట్ట వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి బయలు దేరిన బోలేరా వాహనం కొండపాక శివారులో నర్సరీ వద్ద ఒక్కసారిగా తేనే టీగలు వాహనం నడుపుతున్న డ్రైవర్‌పై దాడి చేశాయి. దీంతో డ్రైవర్ వాహనంపై పట్టు కొల్పోయాడు. అదుపు తప్పిన బోలోరా వాహనం బోల్తాపడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.