Home టెక్ ట్రెండ్స్ హువావే నుంచి మరో స్మార్ట్‌ఫోన్…

హువావే నుంచి మరో స్మార్ట్‌ఫోన్…

honor

ముంబయి: హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 10 జిటిని జులై 24వ తేదీన రిలీజ్ చేయనుంది. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. తర్వాత మిగిలిన దేశాల వినియోగదారులకు లభిస్తోంది. ఈ ఫోన్ ధర వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. భారత్‌లో ఈ ఫోన్ జులై చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇందులో పలు  ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హానర్ 10 జిటి అద్భుత ఫీచర్లు…

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16

24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టీఈ

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఇ, ఎన్‌ఎఫ్‌సి

యూఎస్‌బి టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్