Home టెక్ ట్రెండ్స్ హువావే నుంచి హానర్ 10 స్మార్ట్‌ఫోన్…

హువావే నుంచి హానర్ 10 స్మార్ట్‌ఫోన్…

honor-10-smart-phone

హువావే తన సరికొత్త స్మార్ట్ ఫోన్ హానర్ 10ను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ లో 5.84 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్ ప్లేను అమర్చారు. ఫోన్ వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ముందు భాగంలో 24 మెగా పిక్స్ సెల్ఫీ కెమెరా ఉంది. దీంతో డివైస్ ను ఫేస్ ద్వారా అన్ లాక్ చేసుకునే అద్భుత ఫీచర్ అందుబాటులోఉంది. ఈ ఫోన్ 64/128 జిబి స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానుంది. ఈ ఫోన్ రూ. 27,230, రూ.31,420 ధరలకు వినియోగదారులకు సొంతం కానుంది.

హానర్ 10 ఫీచర్లు…

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,

24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ,

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సి,

యుఎస్‌బి టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.