Home టెక్ ట్రెండ్స్ నయా ఫీచర్లతో ‘ఆనర్ 8సి’ విడుదల

నయా ఫీచర్లతో ‘ఆనర్ 8సి’ విడుదల

honor-8c
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయాదారు సంస్థ ‘హువావే’ సబ్‌బ్రాండ్ ఆనర్ తన తాజా స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఆనర్ 8సి పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ ను గరువారం భారత్‌లో విడుదల చేసింది. అరోరా బ్లూ, మేజిక్ నైట్ బ్లాక్, ప్లాటినం గోల్డ్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ డిసెంబరు 10 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్, హైఆనర్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ఆనర్ 8సి 4జిబి ర్యామ్/32 జిబి స్టోరేజి ఫోన్ ధర రూ.11,999 ఉండగా..64 జిబి వేరియంట్ ఫోన్ ధర రూ.12,999గా ఉంది.

ఫీచర్స్:

డ్యూయల్ సిమ్ (నానో), ఇఎంయుఐ 8.2 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 ఒరియో ఒఎస్, 6.26 అంగుళాల హెచ్‌డి ప్లస్ టిఎఫ్‌టి ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 632 ఎస్ఓసి, 4 జిబి ర్యామ్, 13 ఎంపి + 2 ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8 ఎంపి సెల్ఫీ కెమెరా, 32 జిబి, 64 జిబి ఆన్‌బోర్డ్ స్టోరేజీ వేరియంట్లు, 4,000 ఎంఎహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లభించనున్నాయి.

Honor 8C launched in India