Search
Saturday 22 September 2018
  • :
  • :

ఆడ పిల్లలను గౌరవిస్తే.. దేశాన్ని గౌరవించినట్టే: దత్తాత్రేయ

DATTATREYA

హైదరాబాద్: చిన్నారుల వృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సోమవారం బాలల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ…. చిన్నారులకు చిన్నప్పటి నుంచి విద్య, కళలు నేర్పించాలని సూచించారు. 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాయన్నారు. బాలికల రక్షణకు బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఆడపిల్లలను గౌరవిస్తే దేశాన్ని గౌరవించిన వాళ్లము అవుతామని ఆయన తెలిపారు.

Comments

comments