Home తాజా వార్తలు ఎమ్ఎల్ఎ శ్రీనివాస్ గౌడ్‌కు గౌరవ డాక్టరేట్ బిరుదు

ఎమ్ఎల్ఎ శ్రీనివాస్ గౌడ్‌కు గౌరవ డాక్టరేట్ బిరుదు

srinivas-Goud1

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా ఎమ్ఎల్ఎ శ్రీనివాస్ గౌడ్‌ను గౌరవ డాక్టరేట్ బిరుదు వరించింది. క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ ఆయనను డాక్టరేట్ బిరుదుకు ఎంపిక చేసింది. జులై 29, 2018 ఆదివారం అమీర్‌పేటలో ఉన్న సితార ఆడిటోరియంలో ఎమ్ఎల్ఎ శ్రీనివాస్ గౌడ్‌కు డాక్టరేట్ అవార్డ్‌ను ప్రధానం చేయనున్నట్లు యూనివర్సిటీ ప్రెసిడెంట్ డా. ఎజిసి శోభన్ బాబు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పాత్ర, సామాజిక సేవా కార్యక్రమాలు, పేద ప్రజలకు విద్య, వైద్యం లాంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని  ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశామని పేర్కొన్నారు.