Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పడగ విప్పిన రాజకీయ కక్షలు

Political-Faction

మహబూబ్‌నగర్‌ః ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు పిల్లలు కలిగి ఉండి సర్పంచ్ పదవికి పోటి చేసి గెలుపొందిన వ్యక్తిపై గత రెండు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తూ చివరకు న్యాయాన్ని గెలిపించిన వ్యక్తిని హత్య చేసేందుకు వెనుకాడని ఓ అధికార పార్టీ నేత వ్యవహారం భగ్గుమంది. న్యాయస్థానం తీర్పుతో సర్పంచ్ పదవికి అనర్హుడైన సదరు మాజీ సర్పంచ్ రాజకీయ కక్షతో వ్యక్తిని చంపేందుకు వెనుకాడలేదు. ఈ వ్యవహారం మహబూబ్‌నగర్ జిల్లాలోని సంచలనం రేపింది. కోర్టు తీర్పు వచ్చి వారం రోజులు కూడా గడవక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో సంబంధిత గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యక్ష సాక్షుల, బాధితుల, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షాద్‌నగర్ నియోజక వర్గంలోని కొత్తూర్ మండలం నర్సప్పగూడ గ్రామానికి చెందిన తెలుగుదేశం సీనియర్ కార్యకర్త ఎంకిర్యాల నర్సింలు(38) అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కావలి కృష్ణ మరో పదిహేను మంది అనుచరులు, కుటుంబ సభ్యులు కలిసి నర్సింలుపై శనివారం గ్రామ శివారులో పట్టుకొని చితక బాదారు. దీంతో ప్రాణభయంతో పరుగులు తీస్తూ నర్సింలు నర్సప్పగూడ గ్రామంలోకి ప్రవేశించాడు. అయినప్పటికి కావలి కృష్ణ అతని అనుచరులు కట్టెలతో నర్సింలును వెంబడిస్తూ పరుగులు తీస్తూ వచ్చారు. మూకుమ్మడిగా నర్సింలుపై దాడికి తెగబడుతున్న కావలి కృష్ణ వర్గం ఆగ్రహాన్ని చూసి గ్రామస్థులు రక్షించడానికి ముందుకు రాలేకపోయారు. గ్రామపంచాయతీ ఎదుటే ఈతతంగం జరుగుతుండగా గ్రామానికి చెందిన జంగిలి పార్వతయ్య అనే వ్యక్తి సంఘటన స్థలానికి వచ్చి నివారించబోయాడు. దీంతో కావలి కృష్ణ వర్గం అతడిపై కూడా దాడిచెయడంతో చెయ్యికి తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. ఈ క్రమంలో నర్సింలును కట్టెలతో విపరీతంగా కొట్టగా తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడిఉన్న నర్సింలు చనిపోయాడన్న భావనతో కావలి కృష్ణ అనుచరులు అక్కడినుండి వెళ్ళిపోయారు. రక్తపు మడుగులో ఉన్న నర్సింలును కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చికిత్స కోసం శంషాబాద్‌లోని ట్రిడెంట్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నర్సింహ్మా చేతులు విరిగిపోగా, కాళ్ళకు ఇతర చోట్ల తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. 1994 పంచాయతి రాజ్ చట్ట ప్రకారం కావలి కృష్ణ సర్పంచ్ పదవికి అనర్హుడన్న తీర్పు కోర్టు నుండి విడుదల కావడాన్ని జీర్ణించుకోని కావలి కృష్ణ అతని వర్గం ఈ దాడికి తెగబడినట్లు గ్రామస్థులు చెప్పారు.

Comments

comments