Home తాజా వార్తలు శాంతి దిశగా అడుగులు: కిమ్

శాంతి దిశగా అడుగులు: కిమ్

trump-kim

సింగపూర్: అమెరికా, నార్త్ కొరియా అధినేతల కీలక సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమక్షంలో కీలక ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఉన్న అవరోధాలను అధిగమిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. ఈ చర్చలతో శాంతి దిశగా ఓ పెద్ద అడుగు ముందుకు పడిందన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఓ పెద్ద సమస్య పరిష్కరానికి ఈ చర్చలు ఉపయోగపడ్డాయన్నారు.