Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రజినీపై జోరుగా ఊహాగానాలు

rajiniచెన్నై : తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ఆయన కూడా అత్యంత సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కొత్తపార్టీ ఏర్పాటుపై వారితో మంతనాలు మొదలుపెట్టినట్లు ఉహాగానాలు వస్తున్నాయి. అధికారమంటే మక్కువేనని కొద్దిరోజుల క్రిందట రజనీకాంత్ ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన ప్రకటన దానికి మరింత ఊతమిస్తోంది. ఆర్‌ఎస్‌స్ సిద్ధాంతకర్త గురుమూర్తి, రజినీకాంత్‌తో సమావేశమయ్యారని, పార్టీ ఏర్పాటు దిశగా చర్చిస్తున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో తమిళనాడులో బిజెపికి రజనీ మద్దతు లభిస్తుందని కూడా ప్రచారం జరిగింది. కానీ సూపర్ స్టార్ మాత్రం ఎప్పటిలాగే మౌనం ఆశ్రయించారు. ప్రస్తుతం జయలలిత లేని తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
అంతా కట్టుకథలు : గురుమూర్తి
రజినీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం అవాస్తం అని ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి స్పష్టం చేశారు. ఆయన బిజెపితో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న ప్రచారమంతా ఓ కట్టుకథ, అభూత కల్పన అని ఆయన కొట్టిపారేశారు. మీడియాలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రసారం చేస్తారో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది కావాలనే పనిగట్టుకొని ఈ అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

Comments

comments