Home రాష్ట్ర వార్తలు మృత్యురథం

మృత్యురథం

carజనంపై దూసుకెళ్లిన పాల వ్యాన్  తల్లిబిడ్డల దుర్మరణం, ఆరుగురు సీరియస్,  హైదరాబాద్  శివారు శామీర్‌పేటలో దుర్ఘటన
జవహర్‌నగర్ : వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేద జీవులు. పొట్టకూటి కోసం ఇంటి నుంచి తెల్లవారుజామున బయలుదేరి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుంటారు. ఇంటింటికీ తిరుగు తూ వెంట్రుకలు కొనుగోలు చేస్తూ స్టీలు సామానులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. అదే కోవలో శనివారం కొంత మంది మహిళలు వ్యాపారం కోసం ఇంటినుంచి వెళ్లిన కొద్దిసేపటికే మృత్యువాతపడ్డారు. ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతి వేగంగా వాహనం నడుపుతూ బస్సు కోసం కూర్చొని ఉన్న పది మందిపై కి దూసుకెళ్లడంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మరణించగా, బాలుడి తల్లిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. జవహర్‌నగర్ సిఐ కెవిఎల్ నరసింహరావు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా మద్దూర్ గ్రామానికి చెందిన సంపత్, కడమంచి సుశీల(21) దంప తులు, వారి కుమారుడు నాని (1) బతుకుదెరువు కోసం గత ఐదు సంవత్సరాల క్రితం జవహర్‌నగర్‌కు వలస వచ్చి గబ్బిలాలపేటలో నివా సముంటున్నారు. ఊరూరా స్టీల్ సామానులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా. రోజుమాదిరిగానే వ్యాపారం కోసం కాలనీలోని కొంతమంది మహిళలతో కలిసి శనివారం బయలుదేరి భాగ్యనగర్ కాల నీ బస్‌స్టాప్‌లో బస్సుకోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో బాలాజీనగర్‌కు చెందిన కిరణ్ (36) తన బొలేరో వాహనం (టిఎస్ 07 యబి 1681)ను వేగంగా నడుపుతూ వారిపైకి దూసుకెళ్లాడు. తప్పించు కునే అవకాశం లేకపోవడంతో, ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు మొదట 108కు సమాచారం అందించి, అనంతరం స్థానిక పోలీసులకు తెలిపారు. సిఐ నరసింహరావు, ఎస్‌ఐ ఎన్.వెంకన్న సంఘ టన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలిస్తుం డగా సుశీల మరణించింది. కాగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యా యి. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.