Home కరీంనగర్ ఇది ‘హుస్సేన్ మియా’ వాగే…

ఇది ‘హుస్సేన్ మియా’ వాగే…

hussain-mia-stream

కరీంనగర్: సంవత్సరం ఎల్లా నీటితో కళకళలాడిన హుస్సేన్ మియా వాగు వర్షాలు కురవక నేడు నీరు లేక పోవడంతో పట్నం తుమ్మ చెట్లు పెరిగి రూపు రేఖలు మారిపోయాయి. పెద్దాపూర్ పెద్ద చెరువు కింద ప్రారంభమయ్యే హుస్సేన్ మియావాగు పారకంతో జూలపల్లి,పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఒదెల మండలాలతో పాటు సుల్తానాబాద్ మండలంలోని కొన్ని గ్రామాలు, ఎలిగేడు మండలంలోని కొన్ని గ్రామాలకు తాగు, సాగు నీరు అందించే వనరు ఎండి పోవడంతో భూగర్భ జలాలు ఆడుగంటి నేడు తాగు నీటి ఇబ్బందులు ఎదురయ్యే ఆవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎండిపోని హుస్సేన్‌మియా వాగు ఎండడంతో ఆయా మండలాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో వాగుపై ఆక్కడక్కడ చెక్‌డ్యాంలు నిర్మిస్తే ఆరేండ్ల కాలంలో సైతం నీరు నిల్వ ఉండి, భూగర్భ జలాలు పెరగడంతో పాటు పశువులకు తాగునీరు ఉంటుందని ప్రభుత్వం ప్రధాన వాగు పై చెక్‌డాంలు నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.